అమెరికా ఎన్నికలు; జూనియర్‌ ట్రంప్‌ కలకలం | US Election Donald Trump Jr Tweets World Map Sparks Controversy | Sakshi
Sakshi News home page

అమెరికా ఎన్నికలు; జూనియర్‌ ట్రంప్‌ కలకలం

Published Wed, Nov 4 2020 9:46 AM | Last Updated on Wed, Nov 4 2020 2:48 PM

US Election Donald Trump Jr Tweets World Map Sparks Controversy - Sakshi

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఒట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో జో బైడెన్‌ ముందంజలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ఓ ట్వీట్‌ వివాదాస్పదంగా మారింది. దీనిపై మన దేశంలోని విపక్షాలు మండి పడుతున్నాయి. ట్రంప్‌ తన బుద్ది చూపించుకున్నారు. మనం స్నేహ హస్తం అందిస్తే.. వారు మనల్ని అవమానించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వివరాలు.. మంగళవారం డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ ఓ వరల్డ్‌ మ్యాప్‌ని ట్వీట్‌ చేశారు. దీనిలో దాదాపు అన్ని దేశాలను రిపబ్లికన్‌ పార్టీ కలర్‌ అయిన ఎరుపు రంగులో చూపించారు. అంటే ఈ దేశాలన్ని తన తండ్రి విజయం సాధిస్తాడని నమమ్ముతున్నాయి.. ఆయనకే ఓటు వేస్తాయి అనే ఉద్దేశంతో ఇలా ఎరుపు రంగులో చూపించారు. ఇక ఇండియా, చైనా, లైబేరియా, మెక్సికో వంటి దేశాలను మాత్రం డెమొక్రాట్‌ పార్టీ రంగు బ్లూ కలర్‌లో చూపించారు. ఈ దేశాలన్ని జో బైడెన్కు మద్దతుదారులని.. ఆయనకే ఓటు వేస్తాయని తెలిపారు. అలానే అమెరికాలోని కాలిఫోర్నియా, మేరీల్యాండ్‌ వంటి రాష్ట్రాలను కూడా నీలం వర్ణంలోనే చూపించారు. ఒకే చివరకు నా ఎన్నికల మ్యాప్‌ అంచనా ఇలా ఉంది అంటూ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఈ ట్వీట్‌లో అతడు జమ్ము కశ్మీర్‌, లద్దాఖ్‌, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలను ఎరుపు రంగులో చూపించాడు.  అది కాస్తా వివాదాస్పదంగా మారింది. దీనిపై విపక్షాలు మండి పడితున్నాయి. (చదవండి: ట్రంప్‌ గెలిస్తే అతనికి 112 కోట్లు)

మనం స్నేహితుడని భావిస్తే.. ట్రంప్‌ బుద్ధి చూపించాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి  ఒమర్ అబ్దుల్లా ఈ ట్వీట్‌పై స్పందించారు. ‘సీనియర్‌ ట్రంప్‌తో మనకు ఎంతో స్నేహం. ఇక జూనియర్‌ ట్రంప్‌ ఇండియాని జో బైడెన్‌, కమలా హారిస్‌ మద్దుతుదారుగా చూపించారు. ఆశ్చర్యం ఏంటంటే.. జమ్ము కశ్మీర్‌, ఈశాన్య ప్రాంతాలు మాత్రమే ట్రంప్‌కి ఓటు వేస్తాయని వెల్లడించారు. ఎవరైనా అతడి కలర్‌ పెన్సిల్‌ని లాక్కొండి’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. 

అలానే కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయుకుడు శశి థరూర్‌ కూడా జూనియర్‌ ట్వీట్‌పై స్పందించారు. ‘నమో బ్రొమాన్స్‌కు దక్కిన బహుమతి ఇది. డాన్‌ జూనియర్‌ భారత్‌లోని జమ్ము కశ్మీర్‌, ఈశాన్య ప్రాంతాలను చైనా, మెక్సికో వంటి శత్రువులు, మురికి ప్రదేశాలతో కలిపారు. సెరినేడింగ్‌ ఈవెంట్ల కోసం కోట్లు ఖర్చు చేసినందుకు దక్కిన ఫలితం ఇది’ అన్నారు. (చదవండి: అమెరికా అధ్యక్షులెవరో తేలకపోవచ్చు!)

మరోవైపు భారతదేశానికి మాజీ పాకిస్తాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ఈ మ్యాప్‌ని "ప్రోత్సాహకరంగా"ఉంది అంటూ ప్రశంసించారు. "మంచిది. జమ్మూ కాశ్మీర్‌ని పాకిస్తాన్‌లో భాగంగా చూపించారు. చాలా ప్రోత్సాహకరంగా ఉంది" అంటూ ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement