న్యూయార్క్: డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ చైనా పట్ల వ్యవహరిస్తున్న ధోరణి భారత్‌కి అంత మంచిది కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ అన్నారు. లాంగ్ ఐలాండ్‌లో జరిగిన బైడెన్‌పై అవినీతి ఆరోపణల గురించి తను రాసిన 'లిబరల్ ప్రివిలేజ్' పుస్తకం విజయోత్సవ కార్యక్రమంలో జూనియర్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో జూనియర్ ట్రంప్ మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. (ఓడిపోతే.. దేశం విడిచి వెళతానేమో!)
'చైనా ముప్పును మేము అర్థం చేసుకోగలము. బహుశా భారతీయ అమెరికన్లకన్నా దీని గురించి ఎక్కువగా ఎవరికీ తెలియదు. ఈ రేసులో మీరు మా ప్రత్యర్థిని చూసినప్పుడు.. చైనీయులు బైడెన్‌కు ఎన్నికల ప్రచార నిమిత్తం 1.5 బిలియన్ డాలర్లు ఇచ్చారు. ఎందుకంటే బైడెన్ గొప్ప వ్యాపారవేత్త. అతడిని ఎలాగైనా తమకు సానుకూలంగా మార్చుకోవచ్చనే చైనా భావిస్తోంది. బైడెన్ వైఖరి కూడా చైనా పట్ల ఎప్పుడూ సానుకూలంగానే ఉంటుంది. ఇది భారత్‌కు అంత మంచిది కాదు' అని ఎన్నికల ప్రచారానికి నిధుల సేకరణకు నాయకత్వం వహిస్తున్న కింబర్లీ గిల్‌ఫోయిల్‌తో పాటు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలోనూ ఆయన ప్రసంగించారు. 42 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ జూనియర్ తన 74 ఏళ్ల తండ్రి ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నారు. కాగా.. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3 న జరగనున్నాయి. (ట్రంప్‌కు షాకిచ్చిన ట్విట్టర్)
Comments
Please login to add a commentAdd a comment