వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘కోట్లాది అమెరికన్లకు నా ధన్యవాదాలు. ఎన్నికల్లో గెలవబోతున్నాం, భారీగా సంబరాలు చేసుకుంటాం. ఫ్లోరిడాలో ఓడిపోతామనుకున్నాం, కానీ, భారీ విజయం దక్కింది. కోట్లాది మంది ఉన్న టెక్సాస్‌లో మనం గెలిచాం. పెన్సిల్వేనియాలో మనం ఘన విజయం సాధిస్తున్నాం. మిషిగాన్‌లోనూ ఆధిక్యంలో ఉన్నాం, గెలుస్తాం. జార్జియాలోనూ ఊహించని విజయం దక్కబోతోంది. ( ట్రంప్ సంచలన కామెంట్లు: ట్వీట్ తొలగింపు )
ఈ విజయం ఎవరూ ఊహించలేనిది. చివరి క్షణంలో ఓట్ల లెక్కింపులో మోసం చేయటానికి కుట్ర చేస్తున్నారు. ఉదయం నాలుగు గంటల తర్వాత ఓట్ల లెక్కింపును ఆపాలి. దీని కోసం మేము సుప్రీం కోర్టుకు వెళతాం’’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఇప్పటివరకు జో బైడెన్ 236, డొనాల్డ్ ట్రంప్ 213 ఎలక్టోరల్ ఓట్లు గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment