సాక్షి, బంజారాహిల్స్: ఎన్నికలు ఇరాన్‌లో జరగడమేమిటి? ఇక్కడ హైదరాబాద్‌లో ఓటు వేయడమేమిటి? అర్థం కాలేదు కదూ.. శుక్రవారం ఇరాన్‌లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. తమ దేశ పౌరులందరూ ఈ ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకునేందుకు వీలుగా.. ఆ దేశ కాన్సులేట్ భారత్‌లోని ఢిల్లీ, హైదరాబాద్, రాజమండ్రి, బెంగళూరు, పుణే, ముంబై తదితర ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
అందులో భాగంగానే శుక్రవారమిక్కడ బంజారాహిల్స్‌లోని కాన్సులేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 220 మంది ఇరాన్ పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు రాజమండ్రిలో 28 మంది ఓటేశారు.
చదవండి: ఐరాస సెక్రటరీ జనరల్‌గా మళ్లీ గుటెరస్
Comments
Please login to add a commentAdd a comment