
‘సోనియాతో కీలక విషయం చర్చించా’
న్యూఢిల్లీ: రాజకీయాల గురించి ముఖ్యమైన విషయం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో చర్చించినట్టు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. మంగళవారం సాయంత్రం సోనియాతో ఆమె భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో ముఖ్యమైన అంశం, రాష్ట్రపతి ఎన్నికలపై గురించి సోనియాతో చర్చించినట్టు చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థి పేరుపై చర్చ జరగలేదని వెల్లడించారు.
రాష్ట్రపతి ఎన్నిక విషయంలో విపక్షాల తరపున సంయుక్త అభ్యర్థిని పోటీ పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా ఇంతకుముందు సోనియా గాంధీతో చర్చలు జరిపారు.