న్యూయార్క్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అధ్యక్ష అభ్యర్థుల మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తోంది. మరి కొన్ని గంటల్లో ఎన్నికల కౌంటింగ్ ముగియనుంది. ఈ నేపథ్యంలో డెమొక్రాటిక్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఎన్నికల్లో మేం గెలుస్తాం’ అంటూ ధీమా వ్యక్తం చేశారు. కీలక రాష్ట్రాల్లో డెమొక్రాట్లు ఇప్పటికే గెలిచారని తెలిపారు. మిషిగాన్, విస్కాన్సిన్‌లోనూ తామే గెలుస్తామన్నారు. రిపబ్లిక్ పార్టీ ఆధిక్యతలు తగ్గిపోతాయన్నారు. మెట్రోలు, పట్టణాల్లో తమకు భారీగా ఓట్లున్నాయన్నారు. ప్రచారానికి సహకరించిన వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. డెమొక్రాట్లు ఆశాభావంతో ఉండాలని, తామే గెలువబోతున్నామని పేర్కొన్నారు. ( అమెరికా ఎన్నికలు; జూనియర్ ట్రంప్ కలకలం )
కాగా, ఇప్పటివరకు బైడెన్ 237, ట్రంప్ 210 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. బైడెన్ ఆధిక్యంలో ఉన్నప్పటికి పెద్ద రాష్ట్రాల్లో ట్రంప్ ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్ కొనసాగితే ట్రంప్ గెలిచే అవకాశాలు ఎక్కువ. 288 ఎలక్టోరల్ ఓట్లు సాధించే దిశగా ట్రంప్ అడుగులు ముందుకు వేస్తున్నారు. ( అమెరికా ఎన్నికలు: మరోసారి అధ్యక్ష పీఠం దిశగా ట్రంప్ )
Comments
Please login to add a commentAdd a comment