50 ఏళ్ల క్రితం విడాకులు.. మళ్లీ ఇప్పుడు పెళ్లి! | 50 Years Ago Couple Divorced And Getting Married Again | Sakshi
Sakshi News home page

50 ఏళ్ల క్రితం విడాకులు.. మళ్లీ ఇప్పుడు పెళ్లి!

Published Fri, Apr 6 2018 11:03 AM | Last Updated on Wed, Sep 18 2019 2:52 PM

50 Years Ago Couple Divorced And Getting Married Again - Sakshi

దేవుడు వేసిన ముడి ఎప్పటికి విడిపోదు. ఆ ముడిని తెంచుకోవడం మానవమాత్రులకు ఎలా సాధ్యమవుతుంది. కానీ మారుతున్న కాలంతో పాటు మనిషిలో కూడా మార్పులు వస్తున్నాయి. బ్రహ్మ వేసిన ముడులు విప్పడానికి విడాకులను సృష్టించాడు మానవుడు. విడాకులు మనషికి మాత్రం పరిమితం. మనసుకి కాదు. ఆ మనసులు ఎప్పడూ కలిసే ఉంటాయి. లేదా ఎప్పటికైనా కలుస్తాయి. దీనికి నిదర్శనమే ఈ జంట.

అమెరికా కెంటుకీలోని లెక్సింగ్టన్‌కు చెందిన హరోల్డ్‌ హోలాండ్‌, లిల్లియన్‌ బర్న్స్‌ లు 1968లో విడాకులు తీసుకున్నారు. అప్పటికే వీరికి ఐదుగురు సంతానం ఉంది. విడాకుల అనంతరం వీరిద్దరు వేరే వ్యక్తులను పెళ్లి చేసుకున్నారు. అయితే వారిద్దరు 2015లో చనిపోయారు. అయితే ఆ జంట విడిపోయినా మధ్యమధ్యలో పిల్లలకోసం కలిసేవారు. మాట్లాడుకునే వారు.

హోలాండ్‌ ప్రతీ సంవత్సరం తన కుటుంబంతో గెట్‌ టుగేదర్‌ ప్రోగ్రాంను ఏర్పాటుచేసేవాడు. అయితే ఈ ఏడాది కూడా ఏర్పాటుచేశాడు. అయితే దీనికి మాజీ భార్య బర్న్స్‌ కూడా హాజరయ్యారు. వీరికి పది మంది పిల్లలు,  20కి పైగా మనవళ్లు, 30కి పైగా ముని మనవళ్లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వీరు ఒంటరిగా మాట్లాడుకోవడం వల్ల మరింత సన్నిహితులం అయ్యామని హోలాండ్‌ తెలిపారు.

ఇప్పటికి వీరిద్దరు యువకుల్లానే ప్రేమించుకుంటున్నారనీ, కలిసినప్పుడు చేతులు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తారనీ, ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నప్పుడు కళ్లలో వెలుగులు కనబడతాయని వారి మనవళ్లు చెబుతున్నారు. వీరిద్దరి పెళ్లి వచ్చే వారం చర్చిలో జరగనుంది. పాస్టర్‌ కూడా వీరి మనవడే. గ్రాండ్‌ పేరెంట్స్‌ వివాహం నా చేతులపై జరపడం చాలా ఆనందంగా ఉందనీ, నేను చేసిన అన్ని పెళ్లిళ్లలోనూ ఇది ఎంతో ప్రత్యేకమైందని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement