ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ అద్భుతాన్ని ఆవిష్కరించింది. శాంసంగ్ తన మొదటి ఐసోసెల్ కెమెరా సెన్సార్‌ను RGBW కలర్ ఫిల్టర్ సపోర్ట్‌తో అభివృద్ధి చేసింది.
ఈ కొత్త కెమెరా సెన్సార్‌ను చైనా ఆధారిత కంపెనీ టెక్నో(Tecno) భాగస్వామ్యంతో రూపొందించింది. ఈ కెమెరా సెన్సార్ సహయంతో మెరుగైన రంగు, ప్రకాశంతో కళ్లు చెదిరే ఫోటోలను తీయవచ్చునని కంపెనీ పేర్కొంది. ఈ ఆవిష్కరణను శాంసంగ్ "మానవుడి కంటితో (human eye-like)" పోల్చింది.ఈ కెమెరా సెన్సార్ 2022లో టెక్నో-బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లో రానున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఇతర స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు కూడా అందుబాటులో ఉండనుంది.
కొత్త ISOCELL GWB కెమెరా సెన్సార్ వైట్ పిక్సెల్‌తో కూడిన మెరుగైన కలర్ ఫిల్టర్ నమూనాను ఉపయోగించారని శాంసంగ్ వెల్లడించింది . ఈ సెన్సార్ 64-మెగాపిక్సెల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుందని తెలిపింది. శాంసంగ్ నుంచి రాబోయే Samsung Galaxy S22 స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో ఈ కొత్త కెమెరా సెన్సార్ రావడంలేదు.
చదవండి: బడ్జెట్ ధరలో, బిగ్ బ్యాటరీ సపోర్ట్‌తో శాంసంగ్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్..!
Comments
Please login to add a commentAdd a comment