camera lens
-
అద్భుతాన్ని ఆవిష్కరించిన శాంసంగ్..! మానవ కంటి లాంటి కెమెరా సెన్సార్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ అద్భుతాన్ని ఆవిష్కరించింది. శాంసంగ్ తన మొదటి ఐసోసెల్ కెమెరా సెన్సార్‌ను RGBW కలర్ ఫిల్టర్ సపోర్ట్‌తో అభివృద్ధి చేసింది. ఈ కొత్త కెమెరా సెన్సార్‌ను చైనా ఆధారిత కంపెనీ టెక్నో(Tecno) భాగస్వామ్యంతో రూపొందించింది. ఈ కెమెరా సెన్సార్ సహయంతో మెరుగైన రంగు, ప్రకాశంతో కళ్లు చెదిరే ఫోటోలను తీయవచ్చునని కంపెనీ పేర్కొంది. ఈ ఆవిష్కరణను శాంసంగ్ "మానవుడి కంటితో (human eye-like)" పోల్చింది.ఈ కెమెరా సెన్సార్ 2022లో టెక్నో-బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లో రానున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఇతర స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు కూడా అందుబాటులో ఉండనుంది. కొత్త ISOCELL GWB కెమెరా సెన్సార్ వైట్ పిక్సెల్‌తో కూడిన మెరుగైన కలర్ ఫిల్టర్ నమూనాను ఉపయోగించారని శాంసంగ్ వెల్లడించింది . ఈ సెన్సార్ 64-మెగాపిక్సెల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుందని తెలిపింది. శాంసంగ్ నుంచి రాబోయే Samsung Galaxy S22 స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో ఈ కొత్త కెమెరా సెన్సార్ రావడంలేదు. చదవండి: బడ్జెట్ ధరలో, బిగ్ బ్యాటరీ సపోర్ట్‌తో శాంసంగ్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్..! -
నితీష్ దెబ్బకు కెమెరా పగిలింది.. రషీద్ ఏం చేస్తున్నాడు
ఐపీఎల్ 2021లో భాగంగా ఆదివారం రాత్రి ఎస్ఆర్హెచ్, కేకేఆర్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా కేకేఆర్ ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో నితీష్ రాణా బౌండరీ కొట్టాడు. అయితే బంతి బౌండరీ దాటి పక్కనే ఉన్న కెమెరాకు తాకి లెన్స్ పగిలిపోయాయి. అదే సమయంలో బంతిని అందుకోవడంలో విఫలమైన రషీద్ పగిలిన కెమెరాలో వేలు పెట్టి చూశాడు. ఆ తర్వాత ఏంటో ఇది.. అంటూ ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లను చూస్తూ నవ్వుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Glenn Maxwell: ఒకసారి అంటే సరే.. మళ్లీ అదేనా.. ఏంటి మ్యాక్సీ ఇక మ్యాచ్‌లో కేకేఆర్ విజయాన్ని అందుకుంది. 116 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 4 వికెట్లు కోల్పోయి చేధించింది. శుబ్‌మన్ గిల్ హాఫ్‌సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ విజయంతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపు ఖరారు చేసుకున్నట్లే. రాజస్తాన్ రాయల్స్‌తో జరగనున్న చివరి మ్యాచ్‌లో కేకేఆర్ విజయం అందుకుంటే ఎలాంటి సమీకరణాలు లేకుండానే నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్‌కు చేరనుంది. చదవండి: ఐపీఎల్ 2021 సీజన్లో అత్యంత ఫాస్ట్‌బాల్.. డెబ్యూ మ్యాచ్‌లోనే Nitish Rana breaks Camera lens😍#KKRvSRH #IPL2021 #NitishRana pic.twitter.com/7ItIPsK6rb — Subuhi S (@sportsgeek090) October 3, 2021 -
కొత్త కెమెరా ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్ల సందడి
ముంబై, సాక్షి: కమ్యూనికేషన్ కోసం ప్రారంభమైన స్మార్ట్ ఫోన్లు తదుపరి కాలంలో ఎన్నెన్నో కొంత ఆవిష్కరణలకు దారి చూపుతున్నాయి. సరికొత్త ఫీచర్స్‌తో యూజర్ల జీవితంలో విడదీయలేని భాగంగా మారిపోయాయి. ఇటీవల కాలంలో ప్రధానంగా కెమెరాల విషయంలో అత్యంత ఆధునికతను సంతరించుకోవడం ద్వారా డిజిటల్ కెమెరాల విక్రయాలకే గండి కొడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇటీవల రూ. 15,000లోపు ధర కలిగిన స్మార్ట్ ఫోన్లు సైతం ఆధునిక కెమెరాలు, ఫీచర్స్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. వివరాలు చూద్దాం.. మెగా పిక్సెల్స్ గతంలో రెండు కెమెరాలతో వచ్చిన స్మార్ట్ ఫోన్లు లగ్జరీ విభాగంలో వెలువడేవి. ప్రస్తుతం ప్రస్తుతం 3-4 కెమెరాలు కలిగిన ఫోన్లు సాధారణమైపోయాయి. గత కొన్నేళ్లలో కెమెరాకు ప్రాధాన్యత భారీగా పెరిగింది. దీంతో ఫోన్లకు వెనుకవైపు కనీసం 3 కెమెరాలుంటేనే ప్రస్తుతం నియోగదారులను ఆకట్టుకోగలుగుతున్నాయి. కొద్ది రోజులుగా నైట్ మోడ్స్ వంటివి సాధారణ అంశాలైపోయినట్లు టెక్ నిపుణులు తెలియజేశారు. ఈ బాటలో క్వాడ్‌కామ్ మాడ్యూల్స్ సైతం అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి. లెన్స్‌ల సంఖ్య, మెగాపిక్సెల్స్ సామర్థ్యం, కెమెరా సాంకేతికత వంటి అంశాలకు ప్రాధాన్యత పెరిగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. (ఇకపై రియల్మీ 5జీ స్మార్ట్ ఫోన్లు) 8కే వీడియోలు గతేడాది(2020)లో 4కే వీడియో చిత్రీకరణకు ఆకర్షణ పెరిగింది. దీంతో ఈ ఏడాది(2021) స్మార్ట్ ఫోన్ కంపెనీలు 8కే వీడియోలపై దృష్టిసారించినట్లు టెక్ నిపుణులు ప్రస్తావిస్తున్నారు. గతేడాది చివర్లోనే ఇందుకు బీజం పడినప్పటికీ ఇవి ఏడాది, రెండేళ్లలో అందుబాటులోకి వచ్చే వీలున్నట్లు భావిస్తున్నారు. ఇందుకు ప్రధానంగా 8కే వీడియోలను సపోర్ట్ చేయగల స్ర్కీన్లను సైతం అమర్చవలసి ఉన్నట్లు తెలియజేశారు. స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్ లేదా టీవీ సెట్లలో వీటిని ప్లే చేసేందుకు వీలైన తెరలను ఏర్పాటు చేయవలసి ఉంటుందని వివరించారు. వెరసి 2022కల్లా 8కే వీడియో చిత్రీకరణ చేయగల స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు. (2021లో రియల్మీ కీలక ఫోన్- కేవోఐ) గింబల్ సపోర్ట్ కొన్నేళ్లుగా డిజిటల్ కెమెరాల స్థానంలో స్మార్ట్ ఫోన్ కెమెరాల వినియోగం అధికమైంది. అన్నివేళలా ఫోన్లు అందుబాటులో ఉండటంతోపాటు.. చిత్రీకరణ అత్యంత సులభంకావడంతో వినియోగదారులు కెమెరా ఫీచర్స్పై దృష్టి సారించడం ఎక్కువైంది. దీంతో ఇటీవలి కాలంవరకూ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను స్మార్ట్ ఫోన్ కంపెనీలు సాధారణ ఫీచర్‌గా జత చేస్తూ వచ్చాయి. అయితే సెల్ఫీ ట్రెండ్ ప్రవేశించాక కెమెరాలు, వీటి ఫీచర్స్‌కు ప్రాధాన్యత పెరిగింది. ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వీడియో కంటెంట్లకు డిమాండ్ పెరగడంతో వీడియో సాంకేతికతకూ ప్రాధాన్యత ఏర్పడినట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో ఫొటోలు లేదా వీడియోల స్టెబిలైజేషన్పై దృష్టితో స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు కొత్తగా గింబల్ సాంకేతికతను ప్రవేశపెట్టినట్లు తెలియజేశారు. వివో కంపెనీ ఎక్స్50 ప్రోలో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. సెన్సర్లకూ ప్రాధాన్యం నిజానికి స్మార్ట్ ఫోన్లలో అత్యధిక మెగా పిక్సెల్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ, సెన్సర్లకే ప్రాధాన్యం ఉన్నట్లు టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. ఉదాహరణకు 4కే వీడియోలను చిత్రీకరించాలంటే కనీసం 8 మెగాపిక్సెల్ కెమెరాలు తప్పనిసరని వెల్లడించారు. వెరసి వీడియోల నాణ్యతకు వీలుగా భారీ సెన్సర్లను వినియోగించవలసి ఉంటుందని తెలియజేశారు. ఇక 8కే వీడియోలను చిత్రీకరించాలంటే 33 మెగాపిక్సెల్ కెమెరాలను ఏర్పాటు చేయవలసి ఉంటుందని చెబుతున్నారు. కొంతకాలంగా యాపిల్, గూగుల్ తదితర దిగ్గజాలు 12 ఎంపీ కెమెరాలకే కట్టుబడుతూ వస్తున్నాయి. వీటికి జతగా ఇటీవల మరో 12 ఎంపీ కెమెరాలకు సైతం తెరతీశాయి. ఈ కంపెనీలతోపాటు నాణ్యమైన సెన్సర్లను వినియోగించడం ద్వారా పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు సైతం కెమెరా ఫీచర్స్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నట్లు నిపుణులు ప్రస్తావించారు. డిస్ప్లేలో కెమెరా సెల్ఫీ ట్రెండ్‌కు వీలుగా పలు కంపెనీలు డిస్ప్లేలో అంతర్భాగంగా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు ముందు భాగంలో పాపప్ కెమెరాలు సైతం ఏర్పాటు చేశాయి. దీనిలో భాగంగానే నాచ్ స్టైల్ సెల్ఫీకెమెరాలు, పంచ్ హోల్ కెమెరాల ట్రెండ్‌కు తెరలేచింది. గతేడాది ఇన్‌డిస్‌ప్లే కెమెరాలకూ ఒప్పో, షియోమీ శ్రీకారం చుట్టాయి. ఇవి కొనసాగేదీ లేనిదీ వేచిచూడవలసి ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా.. మూడు విభిన్న కెమెరాల ద్వారా చిత్రీకరించే ఫొటోలు లేదా వీడియోలకు చిప్ సెట్ సైతం సపోర్ట్ చేయవలసి ఉంటుందని, ఈ బాటలోనే క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ఎస్వోసీకి కొత్త ఏడాదిలో స్మార్ట్ ఫోన్ కెమెరాలు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. -
‘క్లియర్ యాజ్ రియల్’ : ప్రపంచంలోనే తొలి ఫోన్
సాక్షి, ముంబై : వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ వివో వీ 17 ప్రోను శనివారం విడుదల చేసింది. ఎప్పటినుంచోటీజర్లతో భారత వినియోగదారులను ఊరిస్తున్న కంపెనీ ఎట్టకేలకు వివో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో విడుదల చేసింది. రెండు సెల్పీ కెమెరాలతో పాటు, డ్యుయల్ పాప్-అప్ రియర్ కెమెరా, మరోరెండు కెమెరా సెటప్‌తో దీన్ని ఆవిష్కరించడం విశేషం. అంటే నాలుగు రియర్ కెమెరాలను ఈ స్మార్ట్‌ఫోన్‌లో అమర్చింది. ఈ తరహా ఫీచర్లతో వస్తున్న ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది. వివో వీ17 ప్రో స్మార్ట్‌ఫోన్ ధరను ఇండియాలో రూ. 29,990గా నిర్ణయించింది. వివో వీ17 ప్రొ 6.59 సూపర్ అమోలెడ్ డిస్ప్లే 2400x1080 పిక్సెల్స్‌రిజల్యూషన్ క్వాల్కం స్నాప్‌బ్రాగన్ 675 సాక్ 8 జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 48+13 ఎంపీ పాప్ అప్ కెమెరా, 8+2 ఎంపీ రియర్ కెమెరా 32+8 ఎంపీ సెల్పీ కెమెరా 4100 ఎంఏహెచ్ బ్యాటరీ రెండు రంగుల్లో లభించనున్న ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీ ఆర్డర్‌కు ప్రస్తుతం అందుబాటులో ఉండగా, సెప్టెంబరు 27 నుంచి కొనుగోలుకు లభ్యం. Double the clarity, double the fun. Make the most of the ordinary moments with the world's first 32MP Dual Pop-Up Selfie & 48MP AI Quad Rear Camera. Experience #ClearAsReal , brighter pictures. Starts at INR 29,990/- . Know more : https://t.co/DEvRS2izRp pic.twitter.com/AfcTJsxYhr — Vivo India (@Vivo_India) September 20, 2019 -
భారీ కెమెరాతో ప్రపంచంలోనే తొలి స్మార్ట్‌ఫోన్
సాక్షి,న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ హువావే సబ్ బ్రాండ్ హానర్ భారీ కెమెరాతో ప్రపంచంలోనే తొలి స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. 48ఎంపీ సోనీ ఐఎంఎక్స్589 సెన్సర్‌తో హానర్ వ్యూ 20 / హానర్ వి 20 పేరుతో జనవరి 29న భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. గత నెలలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. హానర్ వి 20 ఫీచర్లు 6.4 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే 2130x1080 రిజల్యూషన్ హై సిలికాన్ కిరిన్ 980 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ పై 9 6జీబీ/8జీబీ ర్యామ్,128జీబీ/256 స్టోరేజ్ 48ఎంపీ రియర్‌కెమెరా 25 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000ఎంఏహెచ్ బ్యాటరీ ధర : సుమారు రూ. 30వేలు హైఎండ్ వేరియంట్ ధర సుమారు రూ.35వేలు -
మా.. తుఝే సలామ్!
ఒక దృశ్యం వంద మాటలతో సమానం! పి.వి.శివకుమార్ కెమెరా లెన్స్దీ అలాంటి ఎక్స్‌ప్రెషనే ! ఉదాహరణ.. ఇక్కడ కనిపిస్తున్న మదర్ థెరిసా ఫొటో.హిందూ దినపత్రికలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు పి.వి.శివకుమార్. లెన్స్‌కి లైఫ్ ఇచ్చిన ఈ ఫొటోగ్రాఫ్ స్టోరీ ఆయన మాటల్లోనే.. మాటలకందని భావాలెన్నింటినో ఒక్క ఫొటో రిఫ్లెక్ట్ చేస్తుంది. నేను తీసిన ఛాయాచిత్రాల్లో నాకు నచ్చిన.. ఎందరో మెచ్చిన వాటిల్లో ఇదీ ఒకటి. అసలు మదర్‌ను ఫొటో తీసే అవకాశం రావడమే గొప్ప అదృష్టం. ఆ రకంగా కూడా దీన్ని నా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫొటోగా చెప్పుకోవచ్చు. సందర్భం.. 1990లో క్రిస్టియన్ మిషనరీస్ చారిటీ కోసం మదర్ థెరిసా హైదరాబాద్ వచ్చినప్పుడు తీసిన ఫొటో ఇది. అప్పుడు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో పనిచేస్తున్నా. ఆ అసైన్‌మెంట్‌కు నన్ను పంపించారు. దేవుడు ఎలా ఉంటాడో ఎవరూ చూడలేదు. కానీ మదర్ రూపంలో ఉంటాడ నిపించింది.. ఆమెను చూసినప్పుడు! ఆ కళ్లలో కరుణ.. ఆ ముఖంలో ప్రశాంతత.. ఆమె అంతఃకరణలోని స్వచ్ఛతను ప్రతిఫలిస్తుంటాయి. ఆమె సేవాతత్పరతకు నిదర్శనంగా నిలుస్తుంటాయి. అక్కడున్న ఓ సిస్టర్ చేతుల్లో నుంచి ఓ చంటిబిడ్డను మదర్ తన చేతుల్లోకి తీసుకుంటున్నప్పుడు తీసిన ఫొటో ఇది. ఆ సందర్భంలో మదర్ ముఖంలో దైవత్వం కనిపించింది. ఆ బిడ్డ ఆడపిల్ల.. అక్కడున్న ఉయ్యాలలన్నిట్లోనూ ఆడపిల్లలే ఉన్నారు. వీరిలో పెళ్లికాని తల్లుల పిల్లలు కొందరుంటే.. చెత్తకుప్పల్లో దొరికిన శిశువులు ఇంకొందరు.. ఆడపిల్ల అక్కర్లేదనుకున్న తల్లిదండ్రుల బిడ్డలూ కొందరు ఉన్నారు. ఇలా అనాథలైన పిల్లలందరికీ ఈ ప్రపంచంలో చోటుందని తన ఒడిని పట్టిన అమ్మ మదర్ థెరిసా. అలాంటి క్షణంలో ఆమెను నా కెమెరాతో కాదు.. మనసుతో తీసిన ఫొటో ఇది. మదర్ ముఖంలో ఆమె హృదయం కనిపిస్తుంది. ప్రౌడ్ మూమెంట్.. మదర్ వైట్‌హౌస్‌కు వెళ్లినప్పుడు అప్పటి అమెరికా ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్ సతీసమేతంగా వైట్‌హౌస్ బయటకు వచ్చి మరీ మదర్‌ను సాదరంగా లోనికి ఆహ్వానించారు. ప్రపంచం మదర్కిచ్చిన గౌరవం అలా ఉండేది. ఆమె విశ్వవనిత! అలాంటి మదర్.. నేను ఫొటో తీయడానికి వెళ్లినపుడు ‘పేరేంటి? ఏ పేపర్లో పనిచేస్తారు?’ అని అడిగింది. నాలాంటి ఫొటోగ్రాఫర్లను ఎంతమందినో చూసుంటుంది. కానీ, నన్ను అలా పరిచ యం చేసుకోవడం.. ఫర్ మి.. ఇట్ వజ్ ఎ ప్రౌడ్ మూమెంట్! అదీ ఆమె గొప్పదనం. ఈ ఫొటో తెల్లవారి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో గ్రూప్ ప్రతికలన్నిటిలోనూ ఫ్రంట్ పేజ్‌లో పబ్లిష్ అయింది. అదే రోజు సాయంకాలం నిజాం కాలేజ్‌లో జరిగిన రిసెప్షన్‌కు ఈ ఫొటో కాపీలతో సహా వెళ్లాను. వాటి ని మదర్‌కు చూపించాను. నన్ను గుర్తు పట్టింది. ఫొటోలు చూసి మెచ్చుకుంది. ఇంతకన్నా గర్వించదగ్గ విషయం ఇంకేముంటుంది! టెక్నికల్ లెన్స్.. దీన్ని అప్ క్లోజ్‌షాట్ అంటారు. ఈ ఫొటో కోసం వాడిన కెమెరా నికాన్ ఫెమ్ 2. లెన్స్ వచ్చేసి 85 ఎమ్ఎమ్ టెలీఫొటో లెన్స్. ముగింపు.. ఇప్పుడంతా డిజిటల్ యుగం. ఒక్క ఫ్రేమ్‌లో వందల ఫొటోలు తీసేస్తున్నారు. టెక్నాలజీ ఇచ్చిన ఈ వరం శాపం కావద్దు. కళాత్మక దృష్టితో ఒక్క ఫొటో తీస్తే చాలు.. అది స్పష్టమైన భావాన్ని కళ్లముందుంచుతుంది. అంతేకాదు ఫొటోగ్రాఫర్స్.. ఫొటో జర్నలిస్టులు కూడా కావాలని నా కోరిక. ఒక రైటర్ చెప్పలేని ఎక్స్ప్రెషన్ మన ఫ్రేమ్ చెప్తుందని గట్టిగా నమ్ముతాను. ప్రజెంటేషన్: సరస్వతి రమ