IPL 2021: Nitish Rana's Pull Shot Against SRH Breaks Camera's Lens - Sakshi
Sakshi News home page

Rashid Khan: నితీష్‌ దెబ్బకు కెమెరా పగిలింది.. రషీద్‌ ఏం చేస్తున్నాడు

Published Mon, Oct 4 2021 12:24 PM | Last Updated on Mon, Oct 4 2021 8:00 PM

IPL 2021: Rashid Khan Touching Camera Lens After Nithish Rana Boundary - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2021లో భాగంగా ఆదివారం రాత్రి ఎస్‌ఆర్‌హెచ్‌, కేకేఆర్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. కాగా కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ సమయంలో ఇన్నింగ్స్‌ 17వ ఓవర్లో​ ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. జాసన్‌ హోల్డర్‌ బౌలింగ్‌లో నితీష్‌ రాణా బౌండరీ కొట్టాడు. అయితే బంతి బౌండరీ దాటి పక్కనే ఉన్న కెమెరాకు తాకి లెన్స్‌ పగిలిపోయాయి. అదే స​మయంలో బంతిని అందుకోవడంలో విఫలమైన రషీద్‌ పగిలిన కెమెరాలో వేలు పెట్టి చూశాడు. ఆ తర్వాత ఏంటో ఇది.. అంటూ ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాళ్లను చూస్తూ నవ్వుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

చదవండి: Glenn Maxwell: ఒకసారి అంటే సరే.. మళ్లీ అదేనా.. ఏంటి మ్యాక్సీ

ఇక మ్యాచ్‌లో కేకేఆర్‌ విజయాన్ని అందుకుంది. 116 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ 4 వికెట్లు కోల్పోయి చేధించింది. శుబ్‌మన్‌ గిల్‌ హాఫ్‌సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ విజయంతో కేకేఆర్‌ ప్లే ఆఫ్స్‌ బెర్తును దాదాపు ఖరారు చేసుకున్నట్లే. రాజస్తాన్‌ రాయల్స్‌తో జరగనున్న చివరి మ్యాచ్‌లో కేకేఆర్‌ విజయం అందుకుంటే ఎలాంటి సమీకరణాలు లేకుండానే నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్‌కు చేరనుంది.

చదవండి: ఐపీఎల్‌ 2021 సీజన్‌లో అత్యంత ఫాస్ట్‌బాల్‌.. డెబ్యూ మ్యాచ్‌లోనే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement