
Courtesy: IPL Twitter
ఐపీఎల్ 2022లో భాగంగా ఎస్‌ఆర్‌హెచ్, కేకేఆర్ మధ్య మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నితీష్ రాణా కొట్టిన ఒక భారీ సిక్స్ ఎస్‌ఆర్‌హెచ్ డగౌట్‌లోని ఫ్రిజ్ గ్లాస్‌ను పగులగొట్టింది. ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది. ఉమ్రాన్ మాలిక్ వేసిన ఆ ఓవర్ తొలి బంతిని నితీష్ థర్డ్‌మన్ దిశగా భారీ సిక్స్ బాదాడు. అయితే బంతి వేగంగా వెళ్లి ఎస్‌ఆర్‌హెచ్ డగౌట్‌లో ఉన్న ప్రిజ్ గ్లాస్‌ను బ్రేక్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నితీష్ రాణా భారీ సిక్సర్ కోసం క్లిక్ చేయండి
చదవండి: IPL 2022: భలే గొప్ప ఎంట్రీ!.. ఆస్ట్రేలియా కెప్టెన్‌పై ఫ్యాన్స్ ట్రోల్