![IPL 2022: T Natarajan Bullseye Yorker Clean Bowled Krunal Pandya Viral - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/4/NArarajn.jpg.webp?itok=pWAWPX7V)
Courtesy: IPL Twitter
లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్ నటరాజన్ సూపర్ బంతితో మెరిశాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ నటరాజన్ వేశాడు. క్రీజులో కృనాల్ పాండ్యా ఉన్నాడు. ఆ ఓవర్ మూడో బంతిని నట్టూ యార్కర్ వేశాడు. కృనాల్ దాన్ని ఎదుర్కొనే క్రమంలో విఫలమయ్యాడు. అయితే బంతి నేరుగా వెళ్లి వికెట్లను గిరాటేసింది. ఇక్కడివరకు బాగానే ఉంది. సాధారణంగా బంతికి ఏదైనా అడ్డుపడితే నిధానంగా వెళ్లడం చూస్తుంటాం.
కానీ నట్టు వేసిన బంతి ఎంత వేగంగా వికెట్లను గిరాటేసిందో.. అంతే వేగంగా బౌండరీ లైన్‌ను దాటింది. కృనాల్ మొదట బంతి మిస్ అయి బౌండరీ వెళ్లిందనుకున్నాడు.. కానీ తిరిగి చూస్తే బౌల్డ్ అయినట్లు తెలిసింది. దీంతో నిరాశగా పెవిలియన్‌వైపు నడిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక నట్టూ బౌలింగ్ చూసిన ఫ్యాన్స్.. ''ఎంతకాలం అయింది నీ దగ్గర్నుంచి ఇలాంటి బంతి చూసి..'' అంటూ కామెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment