T Natarajan
-
IPL 2024: అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఇరగదీస్తున్న చిచ్చరపిడుగులు వీళ్లే..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పలువురు ఆటగాళ్లు ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఇరగదీస్తున్నారు. బ్యాటర్ల విషయానికొస్తే.. రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ సీజన్లో అన్ క్యాప్డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగి మెరుపులు మెరిపిస్తున్నాడు. రియాన్ ఈ సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 58.43 సగటున 159.14 స్ట్రయిక్‌రేట్‌తో 409 పరుగులు చేసి నాలుగో లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.అన్క్యాప్డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన ఇరగదీస్తున్న మరో బ్యాటర్ అభిషేక్ శర్మ. ఈ ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ఈ సీజన్లో అదిరిపోయే ప్రదర్శనలతో అంచనాలకు అందని రీతిలో రెచ్చిపోతూ తన జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అభిషేక్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో అదిరిపోయే స్ట్రయిక్‌రేట్‌తో 315 పరుగులు చేశాడు.వద్దనుకున్న ఆటగాడే గెలుపు గుర్రమయ్యాడు..ఈ ఐపీఎల్ సీజన్లో ఓ ఆటగాడు ప్రత్యేకించి అందరి దృష్టిని ఆకర్శిస్తున్నాడు. శశాంక్ సింగ్ అనే పంజాబ్ మిడిలార్డర్ బ్యాటర్ ఈ సీజన్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఈ సీజన్లో శశాంక్ మెరుపు స్ట్రయిక్‌రేట్‌తో 288 పరుగులు చేసి తన జట్టు సాధించిన ప్రతి విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. శశాంక్‌ను ఈ సీజన్ వేలంలో పంజాబ్ పొరపాటున సొంతం చేసుకుందని ప్రచారం జరిగింది. పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా మరో శశాంక్ అనుకుని ఈ శశాంక్‌ను సొంతం చేసుకుందని సోషల్‌మీడియా కోడై కూసింది. అంతిమంగా చూస్తే ఈ వద్దనుకున్న ఆటగాడే పంజాబ్ సాధించిన అరకొర విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.ఈ సీజన్లో రఫ్ఫాడిస్తున్న మరో ప్లేయర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్. ప్రభ్‌సిమ్రన్ ఈ సీజన్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి మెరుపు స్ట్రయిక్‌రేట్‌తో 221 పరుగులు చేశాడు. అన్క్యాప్డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగి సంచలనాలు సృష్టిస్తున్న మరో బ్యాటర్ నితీశ్‌కుమార్ రెడ్డి. ఈ ఎస్ఆర్హెచ్ మిడిలార్డర్ బ్యాటర్ ఏ అంచనాలు లేకుండా బరిలోకి దిగి మెరుపు ఇన్నింగ్స్‌లతో తన జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. నితీశ్ ఈ సీజన్ లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సన్‌రైజర్స్ పాలిట గెలుపు గుర్రమయ్యాడు. వీళ్లే కాక చాలామంది అన్క్యాప్డ్ బ్యాటర్లు ఈ సీజన్లో ఇరగదీస్తున్నారు.బౌలర్ల విషయానికొస్తే.. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి బంతితో సత్తా చాటుతున్న వారిలో సన్‌రైజర్స్ పేసర్ నటరాజన్ ముందు వరుసలో ఉన్నాడు. నటరాజన్ గతంలో అద్భుతంగా రాణించినప్పటికీ.. గత కొన్ని సీజన్లలో ఇతని ప్రదర్శన సాధారణ స్థాయికి పడిపోయింది. దీంతో ఈ సీజన్‌కు ముందు ఇతనిపై ఎలాంటి అంచనాలు లేవు. అండర్ డాగ్‌గా బరిలోకి దిగిన నట్టూ.. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం అతను సెకెండ్ లీడింగ్ వికెట్‌టేకర్‌గా కొనసాగుతున్నాడు. అన్క్యాప్డ్ ప్లేయర్లుగా బరిలోకి దిగి ఇరగదీస్తున్న బౌలర్లలో మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్, సందీప్ శర్మ, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్ నట్టూ తర్వాతి స్థానాల్లో ఉన్నాడు. వీరంతా ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి తమతమ జట్ల పాలిట గెలుపు గుర్రాలయ్యారు. -
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్‌కప్‌కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
టీ20 వరల్డ్‌కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టులో కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్, రింకూ సింగ్‌లు వంటి స్టార్ ఆటగాళ్లకి భారత సెలక్షన్ కమిటీ చోటుఇవ్వలేదు. ముఖ్యంగా టీ20ల్లో టీమిండియా నయా ఫినిషర్‌గా మారిన రింకూ సింగ్‌ను సెలక్టర్లు ఎంపిక చేయకపోవడం అందరిని షాక్‌కు గురిచేసింది. మరోవైపు జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్‌లతో బంతిని పంచుకునే మూడో పేసర్‌గా అర్ష్‌దీప్ సింగ్‌ను సెలక్టర్లు అనూహ్యంగా ఎంపిక చేశారు. ఐపీఎల్-2024లో నామమాత్రపు ప్రదర్శన చేస్తున్న అర్ష్‌దీప్‌ను ఎంపిక చేయడం పట్ల భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఆసీస్ క్రికెట్ దిగ్గజం షేన్ వాట్సన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత వరల్డ్‌కప్ జట్టులో మూడో పేసర్‌గా ఎస్ఆర్హెచ్ ఫాస్ట్ బౌలర్ టి నటరాజన్ చోటుదక్కుతుందని తను భావించినట్లు వాట్సన్ తెలిపాడు. "నటరాజన్‌కు భారత టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. నటరాజన్ యార్కర్లను అద్బుతంగా బౌలింగ్ చేయగలడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అతడు నిలికడగా రాణిస్తున్నాడు. అతడి బౌలింగ్‌లో వేరియషన్స్ కూడా ఉంటాయి. క్లిష్టపరిస్థితుల్లో తన బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పే సత్తా నట్టూకు ఉందని" ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాట్సన్ పేర్కొన్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన నటరాజన్.. 15 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు. -
SRH: వాళ్లిద్దరు అద్భుతం.. నితీశ్‌రెడ్డి సూపర్: కమిన్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్- రాజస్తాన్ రాయల్స్ మధ్య గురువారం నాటి మ్యాచ్ ప్రేక్షకులను మునివేళ్ల మీద నిలబెట్టింది. నువ్వా- నేనా అన్నట్లుగా ఆఖరి బంతి వరకు సాగిన ఈ ఉత్కంఠ పోరు అసలైన టీ20 మజాను అందించింది.ఈ హోరాహోరీ పోరులో రాయల్స్‌పై సన్‌రైజర్స్ పైచేయి సాధించి సొంతగడ్డపై గెలుపు జెండా ఎగురవేసింది. దీంతో ఆరెంజ్ ఆర్మీ సంబరాలు అంబరాన్నంటాయి.ఇక గత రెండు మ్యాచ్‌లలో పరాజయాలు చవిచూసి ఎట్టకేలకు మళ్లీ గెలుపు బాట పట్టడంతో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సైతం హర్షం వ్యక్తం చేశాడు.అసలైన టీ20 క్రికెట్ అంటే ఇదేటేబుల్ టాపర్ రాజస్తాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లపై కమిన్స్ ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘నాకు చాలా సంతోషంగా ఉంది. అద్భుతమైన మ్యాచ్ ఇది.అసలైన టీ20 క్రికెట్ అంటే ఇదే. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఆఖరి బంతిని సంధించేపుడు భువీ తన ప్రణాళికను పక్కాగా అమలు చేశాడు.మిడిల్ ఓవర్లలో వీలైనన్ని వికెట్లు తీసేందుకు ప్రయత్నించాం. అదృష్టవశాత్తూ ఆఖరి వరకు పోరాడగలిగాం. ఇక నటరాజన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. యార్కర్లు సంధించడంలో అతడు దిట్ట.ఉప్పల్‌లో మేము ఇప్పటికే చాలా మ్యాచ్‌లు ఆడాం. కాబట్టి 200 లక్ష్యమనేది ఛేదించగలిగే టార్గెట్ అని తెలుసు. అయితే, విజయం మమ్మల్ని వరించింది.అతడొక అద్భుతం అంతేఈరోజు నితీశ్ రెడ్డి పరిస్థితులను అర్థం చేసుకుని చక్కగా ఆడాడు. అతడొక అద్భుతం అంతే! ఫీల్డింగ్‌లోనూ రాణిస్తున్నాడు. బౌలర్‌గానూ తన వంతు సేవలు అందిస్తున్నాడు’’ అంటూ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి, పేసర్లు భువనేశ్వర్ కుమార్, నటరాజన్‌ల ఆట తీరును ప్యాట్ కమిన్స్ కొనియాడాడు.కాగా ఉప్పల్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్(44 బంతుల్లో 58) శుభారంభం అందించగా.. నాలుగో స్థానంలో వచ్చిన నితీశ్ రెడ్డి దుమ్ములేపాడు.42 బంతులు ఎదుర్కొన్న ఈ యువ ఆటగాడు 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 ఫోర్ల పాటు ఏకంగా 8 సిక్సర్లు ఉండటం విశేషం. ఇక విధ్వంసకర వీరుడు హెన్రిచ్ క్లాసెన్ మరోసారి తన బ్యాట్ పవర్ చూపించాడు.కేవలం 19 బంతుల్లోనే 42 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్ కేవలం 3 వికెట్ల నష్టపోయి 201 పరుగులు సాధించింది.లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్‌ను భువీ ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్ జోస్ బట్లర్(0), వన్‌డౌన్‌లో వచ్చిన సంజూ శాంసన్(3)ను డకౌట్ చేశాడు.ఇక 40 బంతుల్లో 67 పరుగులతో ప్రమాదకరంగా మారుతున్న యశస్వి జైస్వాల్ వికెట్‌ను నటరాజన్ తన ఖాతాలో వేసుకోగా.. టాప్ స్కోరర్ రియాన్ పరాగ్(77)ను కమిన్స్ పెవిలియన్‌కు పంపాడు.నరాలు తెగే ఉత్కంఠఈ క్రమంలో చివరి 3 ఓవర్లలో రాయల్స్ విజయ సమీకరణం 27 పరుగులుగా మారగా.. అప్పటికి చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాయల్స్ సునాయాసంగానే లక్ష్యాన్ని ఛేదిస్తుందని అంతా భావించారు.అయితే, రైజర్స్ పేసర్లు అంతా తలకిందులు చేశారు. 18వ ఓవర్లో నటరాజన్, 19వ ఓవర్లో కమిన్స్ తలా కేవలం ఏడు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీయగా.. చివరి ఓవర్లో సమీకరణం 13 పరుగులు మారింది.అప్పుడు బంతిని అందుకున్న భువీ బౌలింగ్‌లో తొలి ఐదు బంతుల్లో 11 పరుగులు వచ్చాయి. చివరి బంతికి 2 పరుగులు అవసరమైన వేళ రోవ్‌మన్ పావెల్‌ను భువీ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో రైజర్స్ ఊపిరి పీల్చుకుంది. నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో గట్టెక్కింది. భువీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.Jumps of Joy in Hyderabad 🥳Terrific turn of events from @SunRisers' bowlers as they pull off a nail-biting win 🧡Scorecard ▶️ https://t.co/zRmPoMjvsd #TATAIPL | #SRHvRR pic.twitter.com/qMDgjkJ4tc— IndianPremierLeague (@IPL) May 2, 2024 -
నటరాజన్ బర్త్‌డే వేడుకలో సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరో
టి నటరాజన్.. భారత క్రికెట్ టీమ్‌లో యార్కర్ కింగ్‌గా గుర్తింపు ఉంది. నేడు (ఏప్రిల్ 4) ఆయన 33వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుండటంతో తనతో పాటు ఉన్న ఆటగాళ్లతో తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో స్టార్ హీరో అజిత్ సడన్ ఎంట్రీ ఇచ్చి షాకిచ్చాడు. నటరాజన్ పుట్టినరోజు వేడుకలకు అజిత్ ఎంట్రీ ఎలా జరిగిందంటే.. ఏప్రిల్ 5న సన్‌రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో టీమ్ అంతా ఒక స్టార్ హోటల్లో బస చేసింది. నేడు నటరాజన్ పుట్టినరోజు కావడంతో టీమ్ సభ్యులు కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఇకపోతే సన్‌రైజర్స్ బస చేసిన హోటల్లోనే హీరో అజిత్ కూడా ఉన్నారు. నటరాజన్ పుట్టినరోజు విషయాన్ని తెలుసుకున్న ఆయన ఆ వేడుకల్లో హఠాత్తుగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో అజిత్‌ను చూసిన వారందరూ షాక్ అయ్యారు. ఇంతలో అజిత్ కేక్ కట్ చేసి నటరాజన్‌కు తినిపించాడు. తన అభిమాన హీరో అజిత్‌తో ఈ పుట్టినరోజు జరుపుకోవడం తన జీవితంలో మరిచిపోలేనదని నటరాజన్ పేర్కొన్నాడు. అదే సమయంలో క్రికెట్ మాజీ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ కూడా ఉన్నారు. వారందరూ అజిత్‌తో కలిసి ఫోటోలు దిగి ఎంజాయ్ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గత కొన్నాళ్లుగా గాయాలతో బాధపడుతున్న నటరాజన్ ఈ ఏడాది ఐపీఎల్లో రీఎంట్రీ ఇచ్చి బాగా ఆడుతున్నాడు. ఐపీఎల్ 2020 సీజన్లో మెరిసిన యువ కిషోరం నటరాజన్. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపన రాణిస్టూ నట్టూగా పేరు పొందాడు, ఐపీఎల్లో యార్కర్లతో అదరగొట్టి, టీమిండియాలో ఊహించని విధంగా ఎంట్రీ ఇచ్చాడు. నెట్‌బౌలర్ నుంచి టీమ్ఇండియా పేసర్ స్థాయికి ఆయన ఎదిగాడు. నటరాజన్ సేలం సమీపంలోని చిన్నపంబట్టి అనే గ్రామానికి చెందినవాడు. నటరాజన్ కెరియర్ ప్రారంభంలో తన అమ్మగారు అదే గ్రామంలో కూరగాయలు అమ్ముతుండగా.. తండ్రి ఓ కూలీ. బస్సు ఎక్కేందుకు రూ.5 లేని పరిస్థితి నుంచి నేడు తమ కుటుంబాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడని ఓ సందర్భంలో తన అమ్మగారు సగర్వంగా చెప్పుకొచ్చారు. -
Dhoni: నాకూ కూతురు ఉంది.. మరి అక్క ఏది? తంబీ లేడా?.. తప్పు చేశావు కుట్టీ!
IPL 2023 CSK Vs SRH- MS Dhoni: మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనిని అభిమానించని క్రికెట్ ప్రేమికులు ఉండరనడంలో అతిశయోక్తి లేదు. మైదానంలో తనదైన బ్యాటింగ్, కెప్టెన్సీ వ్యూహాలతో ఆకట్టుకునే ధోని.. ఒక్కసారి ఆట ముగిసిందంటే పూర్తిగా సాధారణ వ్యక్తిలా మారిపోతాడు. చిన్నాపెద్దా తేడా లేకుండా అభిమానులతో కలిసిపోయి ఉల్లాసంగా గడుపుతాడు ఈ టీమిండియా మాజీ సారథి. ఇక ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ధోనికి తమిళనాట ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తలైవా అంటూ ధోనిపై అభిమానం చాటుకునే తమిళ తంబీలలో టీమిండియా క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ నటరాజన్ కూడా ఉన్నాడు. ఐపీఎల్-2023లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ మ్యాచ్ నేపథ్యంలో నటరాజన్ కుటుంబం ధోనిని కలిసింది. ఈ క్రమంలో తన చిన్నారి కూతురిని నట్టూ.. ధోనికి పరిచయం చేయగా.. తలా ఆ బుజ్జాయితో సరదాగా ముచ్చటించాడు. నాకూ కూతురు ఉంది హై ఫై ఇవ్వాలంటూ పాపను అడుగగా.. తను మాత్రం చేతులు వెనక్కి పెట్టుకుంది. తను భయపడుతోందని భావించిన ధోని.. చిరునవ్వులు చిందిస్తూ.. ‘‘నాకూ ఓ కూతురు ఉంది.. తను కూడా నీలాగే ఉంటుంది’’ అంటూ బుడ్డదాన్ని దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేశాడు. అక్క ఏది.. తంబీ లేడా? అయినప్పటికీ నటరాజన్ కూతురు.. ‘‘అక్క ఏది.. తంబీ లేడా..’’ అని ప్రశ్నలు కురిపించిందే తప్ప.. మిస్టర్ కూల్ దగ్గరికి మాత్రం వెళ్లలేదు. దీంతో ధోని సరే మరి ఇక అంటూ నటరాజన్ కుటుంబంతో ఫొటో దిగి అక్కడి నుంచి కదిలాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సీఎస్కే.. ‘‘కుట్టీ చట్టీస్తో ఇలా ఉంటది’’ అంటూ షేర్ చేయగా.. నెట్టింట వైరల్‌గా మారింది. తప్పు చేశావు కుట్టీ.. వామిక పాపను ఎప్పుడు చూస్తామో! ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘అందుకే ధోనిని మిస్టర్ కూల్ అనేది. చిన్నపిల్లలతోనూ ఇట్టే కలిసిపోతాడు. నువ్వు సూపర్ తలైవా’’ అని కొనియాడుతున్నారు. ఇక నటరాజన్ కూతురిని ఉద్దేశించి.. ‘‘తప్పు చేశావు కుట్టీ.. కాస్త పెద్దయ్యాక.. ‘‘అయ్యో ఆరోజు ధోని సర్‌కు ఎందుకు హై ఫై ఇవ్వలేకపోయానే అని బాధపడతావు’’.. ఏదేమైనా ధోనితో సరదాగా సమయం గడిపే అవకాశం నీకు దక్కింది. వామిక పాప(విరాట్ కోహ్లి కూతురు)ను ఎప్పుడిలా చూస్తామో’’ అని ఫ్యాన్స్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సొంతమైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో సీఎస్కే 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. కాగా ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ పేసర్ నటరాజన్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. చదవండి: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ధోని.. ఒకే ఒక్కడు! దరిదాపుల్లో ఎవరూ లేరు ఒక్క బంతి కూడా వేస్ట్ చేయలేదు... ఇది బాలేదు అని చెప్పడానికి ఏమీలేదు! A dose of kutty chutties to make your day! 🦁💛#CSKvSRH #WhistlePodu #Yellove #IPL2023 @Natarajan_91 pic.twitter.com/Fx4gywH6aW — Chennai Super Kings (@ChennaiIPL) April 22, 2023 -
చెన్నైతో మ్యాచ్.. సన్‌రైజర్స్ జట్టులో కీలక మార్పు! యార్కర్ల కింగ్‌కు నో ఛాన్స్
ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సీఎస్కే రూపంలో మరో గట్టి సవాలు ఎదురుకానుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా శుక్రవారం(ఏప్రిల్ 21) పటిష్టంగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. కాగా ఎస్ఆర్హెచ్ తమ చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే గత మ్యాచ్‌లో తప్పిదాలను రిపీట్ చేయకుండా.. సీఎస్కే గట్టి పోటీ ఇవ్వాలని మార్క్రమ్ సేన భావిస్తోంది. ఇక చెన్నైతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఒకే మార్పుతో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. గత మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన స్టార్ పేసర్ టి నటరాజన్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌కు ఛాన్స్ ఇవ్వాలని ఎస్ఆర్హెచ్ మేనెజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నటరాజన్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో నటరాజన్ ఏకంగా 50 పరుగులు ఇచ్చాడు. అదే విధంగా ఈ మ్యాచ్‌కు స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్‌ను ఎస్ఆర్హెచ్ పక్కన పెట్టింది. అయితే నటరాజన్ ఎస్ఆర్హెచ్ మేనెజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో నటరాజన్‌ను కాదని ఉమ్రాన్ వైపే ఎస్ఆర్హెచ్ మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక చివరగా ఆర్సీబీ మీద గెలిచి మంచి జోష్ మీద ఉన్న సీఎస్కేను ఆరెంజ్ ఆర్మీ ఎంతవరకు అడ్డుకుంటుందో వేచి చూడాలి. ఎస్ఆర్హెచ్ తుది జట్టు(అంచనా) హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, మార్కో జానెసన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే చదవండి: IPL 2023: సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. చెన్నైకి గుడ్ న్యూస్! 16 కోట్ల ఆటగాడు రెడీ.. Aiden Markram is all of us after checking the Chennai weather 🥵🌡️ pic.twitter.com/qUUgEhPdZL — SunRisers Hyderabad (@SunRisers) April 19, 2023 -
IPL 2023: ‘పవర్ ప్లే’లోనే ఓడిపోయాం! టాస్ విషయంలో మా నిర్ణయం సరైందే!
IPL 2023 SRH Vs RR- సాక్షి, హైదరాబాద్: రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తమ ఓటమికి రెండు ‘పవర్ ప్లే’లలో ప్రదర్శనే కారణమని సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్ బ్రియాన్ లారా అభిప్రాయపడ్డాడు. ‘ముందుగా రాజస్తాన్ పవర్‌ప్లేను అద్భుతంగా వాడుకొని 85 పరుగులు చేసింది. అదే మా వంతు వచ్చేసరికి పవర్‌ప్లేలో పరుగులే చేయలేకపోయాం. 200కుపైగా స్కోరు ఛేదిస్తూ తొలి ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోతే కోలుకోవడం కష్టమే’ అని లారా అన్నాడు. అయితే, తమ జట్టు స్టార్ పేసర్ నటరాజన్ ప్రదర్శన పట్ల లారా సంతృప్తి వ్యక్తం చేశాడు. గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన నటరాజన్.. తన రెండో ఓవర్ నుంచి పుంజుకున్న తీరు అమోఘమని కొనియాడాడు. తొలుత పరుగులిచ్చినా ఆ తర్వాత పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్లు తీసిన తీరును ప్రశంసించాడు. ఇలాంటి సానుకూల అంశాలు కూడా ఆఖరి ఎనిమిది ఓవర్లలో తమ బౌలర్లు మెరుగైన ప్రదర్శన కనబరిచారని.. ఒకానొక సమయంలో రాజస్తాన్ రాయల్స్ 225 పరుగుల స్కోరు చేస్తుందని భావిస్తే.. 200 రాబట్టడానికి కూడా ఇబ్బంది పడేలా చేశారని లారా పేర్కొన్నాడు. అనేక ప్రతికూలతల నడుమ ఇలాంటి సానుకూల అంశాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తాత్కాలిక కెప్టెన్ భువనేశ్వర్‌కుమార్ నిర్ణయాన్ని లారా సమర్థించాడు. ‘‘ఉప్పల్ పిచ్‌పై మేము ప్రాక్టీసు చేశాం. వికెట్ కాస్త బౌన్సీగా ఉన్నట్లు అనిపించింది. పేస్‌కు అనుకూలిస్తుందని భావించాం. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాం. ఏదేమైనా ఒక్క మ్యాచ్‌లో ఓటమితో కుంగిపోము. మెరుగైన ప్రదర్శనతో ముందుకు సాగుతాం’’ అని లారా పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: ఇదొక్కటి! బ్యాటర్‌కు దిమ్మతిరిగింది.. అంతేనా ఆఖర్లో రెండు సిక్సర్లు! Nattu in death overs 👉 Always 🔥#OrangeFireIdhi #OrangeArmy #IPL2023 #SRHvRR pic.twitter.com/DIErNzIWxm — SunRisers Hyderabad (@SunRisers) April 3, 2023 -
టీమిండియా ప్రపంచకప్ గెలవదు.. నటరాజన్‌కు అవకాశం ఇవ్వాలి: పాక్ మాజీ క్రికెటర్
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో 1-2 తేడాతో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా భారత్ అంతగా రాణించలేకపోయింది. వన్డే వరల్డ్‌కప్ సన్నహాకాల్లో భాగంగా జరిగిన సిరీస్‌లో ఓటమిపాలైన రోహిత్ సేనపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. వన్డే ప్రపంచకప్‌ను భారత్ గెలవాలంటే మెరుగైన బౌలింగ్ యూనిట్ అవరమని కనేరియా అభిప్రాయపడ్డాడు. కనేరియా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. "ప్రస్తుతం టీమిండియా చెత్త బౌలింగ్ లైనప్ కలిగి ఉంది. వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు మెరుగైన బౌలర్లు అవసరం. ప్రస్తుత బౌలర్లతో భారత్ వన్డే ప్రపంచకప్‌ను గెలవలేదు. బుమ్రా అందుబాటులో లేడు కాబట్టి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్,టి నటరాజన్ వంటి బౌలర్లకు అవకాశం ఇవ్వాలి. ఇక భారత బ్యాటర్లు స్పిన్‌కు అద్భుతంగా ఆడుతారని అందరూ అంటుంటారు. వారు నెట్స్‌లో ముఖ్యంగా అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్‌లను ఎదుర్కొంటారు. వారి కొంచెం వేగంగా బౌలింగ్ చేయడం వల్ల బంతి పెద్దగా టర్న్ కాదు. అయితే మూడో వన్డేలో ఆస్ట్రేలియా స్పిన్నర్లు బంతిని అద్భుతంగా టర్న్ చేశారు. కాబట్టి భారత బ్యాటర్లు స్పిన్‌కు వికెట్లు సమర్పించుకున్నారు అని అతడు పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: పంత్ స్థానంలో విధ్వంసకర ఆటగాడు.. ఎవరంటే? -
ఐపీఎల్ 2022లో అదరగొట్టిన లెఫ్టార్మ్ పేసర్లు వీరే..
ఐపీఎల్-2022 తుది దశకు చేరుకుంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్‌కు ఫైనల్‌కు చేరుకోగా.. క్వాలిఫైర్-2లో శుక్రవారం రాజస్తాన్ రాయల్స్, ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. ఇది ఇలా ఉంటే.. ఈ ఏడాది సీజన్లో యువ లెఫ్టార్మ్ పేసర్లు తమ అత్యుత్తమ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. మొహ్సిన్ ఖాన్, టి నటరాజన్, యష్ దయాల్, ఖలీల్ అహ్మద్ వంటి లెఫ్టార్మ్ బౌలర్లు తమ జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించారు. మొహ్సిన్ ఖాన్ ఐపీఎల్-2022లో మొహ్సిన్ ఖాన్ లక్నో సూపర్ జెయింట్స్ ప్రాతినిధ్యం వహించాడు. అయితే అతడికి టోర్నీ ఆరంభంలో పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ కొన్ని మ్యాచ్‌ల తర్వాత తుది జట్టులోకి వచ్చిన మొహ్సిన్ అదరగొట్టాడు. పేస్ బౌలింగ్‌తో జట్టులో తన స్ధానాన్ని సుస్ధిరం చేసుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో 9 మ్యాచ్‌లు ఆడిన మొహ్సిన్ ఖాన్ 14 వికెట్లు పడగొట్టాడు. టి నటరాజన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన టి.నటరాజన్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. గాయం కారణంగా ఈ ఏడాది సీజన్లో కొన్ని మ్యాచ్‌లకు నటరాజన్ దూరమయ్యాడు. 11 మ్యాచ్‌లు ఆడిన నటరాజన్ 18 వికెట్లు తీశాడు. ఖలీల్ అహ్మద్ ఈ ఏడాది సీజన్లో ఖలీల్ అహ్మద్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతనిధ్యం వహించాడు. ఢిల్లీ విజయాల్లో ఖలీల్ తన వంతు పాత్ర పోషించాడు. 10 మ్యాచ్‌లు ఆడిన ఖలీల్ 16 వికెట్లు పడగొట్టాడు. యశ్ దయాళ్ గుజరాత్ టైటాన్స్ తరపున యశ్ దయాళ్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. డెబ్యూ సీజన్లోనే యశ్ ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన దయాళ్ 10 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2022: 'బట్లర్ నాకు రెండో భర్త' .. ఎలా అంటే: రాజస్తాన్ ఆటగాడి భార్య ఆసక్తికర వాఖ్యలు ! -
'నటరాజన్ గాయం నుంచి కోలుకున్నాక తన ఫామ్‌ను కోల్పోయాడు'
ఐపీఎల్-2022 సీజన్ ఆరంభంలో అద్భుతంగా రాణించిన సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ టి. నటరాజన్.. టోర్నీ సెకెండ్ హాఫ్‌లో నిరాశపరిచాడు. ఎస్ఆర్హెచ్ ఆడిన గత కొన్ని మ్యాచ్‌లలో నట్టు భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో నటరాజన్ భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. గాయం నుంచి కోలుకున్నాక నటరాజన్ అంతగా రాణించలేకపోతున్నాడని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా ఈ ఏడాది సీజన్లో గాయం కారణంగా రెండు మ్యాచ్‌లకు నటరాజన్ దూరమయ్యాడు. మే 14న కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో తిరిగి జట్టులోకి నటరాజన్ వచ్చాడు. కాగా ఎస్ఆర్హెచ్ ఆడిన చివరి మ్యాచ్‌లో ముంబైపై 4 ఓవర్లలో ఏకంగా నటరాజన్ 60 పరుగులు ఇచ్చాడు. ఈ ఏడాది సీజన్లో తమ అఖరి మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. "నటరాజన్ గాయం నుంచి కోలుకున్నాక తన బౌలింగ్‌లో కొంత రిథమ్‌ను కోల్పోయాడు. ఎస్ఆర్హెచ్ ఆడిన చివరి మ్యాచ్‌లో యార్కర్లను వేయడానికి అతడు చాలా కష్టపడ్డాడు. యార్కర్లు వేయడానికి ప్రయత్నించి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ ఈ టోర్నీలో బాగా రాణించాడు. అతడు ఇదే ఫామ్‌ను కొనసాగిస్తాడని భావిస్తున్నాను. ఇక ఉమ్రాన్ మాలిక్ కూడా అద్భుతమైన ఫాస్ట్ బౌలర్. అయితే అతడు తన నాలుగు ఓవర్లలో 40 పరుగులైనా ఇవ్వవచ్చు లేదా మూడు వికెట్లు అయినా తీయవచ్చు అని" ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. ఇక ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన నటరాజన్ 11 వికెట్లు పడగొట్టాడు. చదవండి: Ind Vs Eng: అదరగొడుతున్నాడు.. అతడిని ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేయండి: గావస్కర్ -
'అతడు యార్కర్ల కింగ్.. ఆస్ట్రేలియా విమానం ఎక్కనున్నాడు'
ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ టి. నటరాజన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. తన యార్కర్లతో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. కాగా శనివారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో నటరాజన్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన నటరాజన్ 15 వికెట్లు పడగొట్టాడు. పర్పుల్ క్యాప్ రేసులో ప్రస్తుతం నటరాజన్ రెండో స్ధానంలో ఉన్నాడు. ఈ క్రమంలో నటరాజన్‌పై భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. నట్టు ప్రస్తుత ఫామ్‌ను చూస్తుంటే అతడు ఖచ్చితంగా టీ20 ప్రపంచకప్ భారత జట్టులో ఉంటాడని గవాస్కర్ తెలిపాడు. "అతడు యార్కర్లు కింగ్ అని మనందరికీ తెలుసు. అతడు గాయం నుంచి కోలుకోని అద్భుతంగా రాణించడం ఎంతో ఆనందంగా ఉంది. టీ20 ప్రపంచకప్-2021లో నటరాజన్ సేవలను భారత్ కోల్పోయింది. అతడు 16 నుంచి 20 ఓవర్ల మధ్య అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. అతడు పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించడంతో భారత టీ20 ప్రపంచకప్ జట్టులో అతడు ఖచ్చితంగా ఉంటాడు. నటరాజన్ కూడా తన ప్రదర్శనతో భారత జట్టులో చోటు దక్కించుకోవాలి అని భావిస్తున్నాడు. నటరాజన్ ఆస్ట్రేలియా విమానం ఎక్కడానికి సిద్దంగా ఉండాలి" అని గవాస్కర్ పేర్కొన్నాడు. ఇక ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్-2022 జరగనున్న సంగతి తెలిసిందే. చదవండి: IPL 2022: 'కోహ్లి వరుసగా రెండు గోల్డెన్ డక్‌లు.. మాకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి' -
నటరాజన్ సూపర్ డెలివరీ.. గైక్వాడ్‌కు ఫ్యూజ్‌లు ఔట్.. వీడియో వైరల్!
ఐపీఎల్-2022లో భాగంగా సీఎస్కేతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పేసర్ నటరాజన్ సూపర్ బంతితో మెరిశాడు. చెన్నై ఇన్నింగ్స్ 5 ఓవర్ వేసిన నటరాజన్ తొలి బంతికే అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో రుత్‌రాజ్ గైక్వాడ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. నటరాజన్ వేసిన బంతిని గైక్వాడ్ అంచనా వేసే లోపే బంతి మిడిల్ స్టంప్‌ను గిరాటేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే విధంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లోను కృనాల్ పాండ్యాను అద్భుతమైన యార్కర్‌తో నటరాజన్ పెవిలియన్‌కు పంపిన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2022: తెవాటియా సిక్సర్ కొట్టగానే ఎగిరి గంతేసిన అమ్మాయి.. ఇంతకీ ఎవరామె?! https://t.co/MQpI4R5Uoj — Ranga swamy - SEO Analyst Internet (@RangaSeo) April 9, 2022 -
"అతడు యార్కర్ల కింగ్.. ప్రపంచకప్‌లో అతడి సేవలను కోల్పోయాం"
టీమిండియా ఫాస్ట్ బౌలర్ టి. నటరాజన్‌పై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న నటరాజన్ అద్భుతంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక టీ20 ప్రపంచకప్-2021లో నటరాజన్ సేవలను భారత్ కచ్చితంగా కోల్పోయింది అని రవిశాస్త్రి తెలిపాడు. గత ఏడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో నటరాజన్ మోకాలికి గాయమైంది. దీంతో టీ20 ప్రపంచకప్‌కు నటరాజన్ దూరమయ్యాడు. అయితే అతడు ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ సాధించి ఐపీఎల్లో అడుగుపెట్టాడు. "టీ20 ప్రపంచకప్‌లో నటరాజన్ సేవలను కోల్పోయాం. అతడు ఫిట్‌గా ఉంటే ఖచ్చితంగా జట్టులో ఉండేవాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో నటరాజన్ గాయపడ్డాడు. అతడు స్పెషలిస్ట్ డెత్ బౌలర్, యార్కర్లను అద్భుతంగా వేయగలడు. అతడు తన పేస్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు ముప్ప తిప్పలు పెడతాడు. నేను అతడిని ఎంపిక చేసిన ప్రతి మ్యాచ్‌లోను భారత్ విజయం సాధించింది. అతడి అరంగేట్ర టీ20 మ్యాచ్‌లోను భారత్ విజయం సాధించింది. అదే విధంగా అతడి టెస్టు అరంగేట్రంలోను టీమిండియా గెలిపొందింది. నటరాజన్ నెట్ బౌలర్ నుంచి ఈ స్థాయికి ఎదగడం నిజంగా గర్వించ దగ్గ విషయం" అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: దేవుడి దయ వల్ల అమ్మ ఇప్పుడు బాగుంది.. ఈ అవార్డు తనకే! -
'నట్టూ భయ్యా.. ఎంతకాలం అయ్యిందో ఇలాంటి బంతి చూసి'
లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బౌలర్ నటరాజన్ సూపర్ బంతితో మెరిశాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ నటరాజన్ వేశాడు. క్రీజులో కృనాల్ పాండ్యా ఉన్నాడు. ఆ ఓవర్ మూడో బంతిని నట్టూ యార్కర్ వేశాడు. కృనాల్ దాన్ని ఎదుర్కొనే క్రమంలో విఫలమయ్యాడు. అయితే బంతి నేరుగా వెళ్లి వికెట్లను గిరాటేసింది. ఇక్కడివరకు బాగానే ఉంది. సాధారణంగా బంతికి ఏదైనా అడ్డుపడితే నిధానంగా వెళ్లడం చూస్తుంటాం. కానీ నట్టు వేసిన బంతి ఎంత వేగంగా వికెట్లను గిరాటేసిందో.. అంతే వేగంగా బౌండరీ లైన్‌ను దాటింది. కృనాల్ మొదట బంతి మిస్ అయి బౌండరీ వెళ్లిందనుకున్నాడు.. కానీ తిరిగి చూస్తే బౌల్డ్ అయినట్లు తెలిసింది. దీంతో నిరాశగా పెవిలియన్‌వైపు నడిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక నట్టూ బౌలింగ్ చూసిన ఫ్యాన్స్.. ''ఎంతకాలం అయింది నీ దగ్గర్నుంచి ఇలాంటి బంతి చూసి..'' అంటూ కామెంట్ చేశారు. నటరాజన్ అద్బుత యార్కర్ బంతి కోసం క్లిక్ చేయండి చదవండి: సుందర్- ఎవిన్ లూయిస్ చిత్రమైన యుద్దం.. చివరికి -
నటరాజన్ బౌలింగ్.. భారీ సిక్స్ బాదిన విలియమ్సన్.. వీడియో వైరల్!
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మహా సంగ్రామానికి మరి కొద్ది రోజుల్లో తెర లేవనుంది. మార్చి 26 నుంచి ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. దీంతో ఆయా జట్లు ప్రాక్టీస్ సెషన్స్‌లో బీజీగా గడుపుతున్నాయి. ఈ క్రమంలో సన్‌రైజెర్స్ హైదరాబాద్ జట్టు సైతం తీవ్రంగా శ్రమిస్తోంది. సన్నాహాల్లో భాగంగా చెపాక్ స్టేడియంలో ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ సన్‌రైజెర్స్ హైదరాబాద్ ఆడింది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ రెండు జట్లుగా విడిపోయింది. అయితే ఆ జట్టు స్టార్ బౌలర్ నటరాజన్ బౌలింగ్ చేయగా.. సన్‌రైజెర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ భారీ సిక్స్ బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎస్ఆర్హెచ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా గాయం కారణంగా గత కొంత కాలంగా విలియమ్స్ ఏ విధమైన క్రికెట్ ఆడలేదు. అయితే అతడు పూర్తి ఫిట్నెస్ సాధించి ఈ మెగా టోర్నీకు సిద్దమయ్యాడు. ఈ సీజన్లో సన్‌రైజెర్స్ హైదరాబాద్ జట్టుకు హెడ్ కోచ్‌గా టామ్ మూడీ, బ్యాటింగ్ కోచ్‌గా బ్రియాన్ లారా, బౌలింగ్ కోచ్‌గా డెల్ స్టెయిన్ వ్యవహరించనున్నారు. మరో వైపు ఐపీఎల్ మెగా వేలంలో పూరన్, రొమారియో షెపర్డ్ వంటి స్టార్ ఆటగాళ్లను ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. ఇక మార్చి 29 న ఎస్ఆర్హెచ్ తన తొలి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌ను ఢీకొట్టనుంది. చదవండి: IPL 2022: షాట్లతో అలరించిన రిషభ్ పంత్.. రెప్పవాల్చని యువ ఆటగాళ్లు pic.twitter.com/glfzpFu3Em — Sports Hustle (@SportsHustle3) March 21, 2022 -
వికెట్‌ను విరగ్గొట్టిన సన్‌రైజెర్స్ స్టార్ బౌలర్.. ఇక బ్యాటర్లకు చుక్కలే!
ఐపీఎల్-2022 సమరానికి సమయం దగ్గరపడతుండంతో ఆయా జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలో సన్‌రైజెర్స్ హైదరాబాద్ స్టార్ బౌలర్ టి నటరాజన్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే నటరాజన్ తన ప్రాక్టీస్‌లో భాగంగా అద్భుతమైన బంతితో ఏకంగా వికెట్‌ను విరగొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను ఎస్ఆర్హెచ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక గాయం కారణంగా గతేడాది ఐపీఎల్లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే నటరాజన్ ఆడాడు. అయితే ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ సాధించి ఈ ఏడాది సీజన్లో సత్తా చాటడానికి నటరాజన్ సిద్దమయ్యాడు. మరోవైపు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ నేతృత్వంలో నటరాజన్ మరింత రాటుదేలుతున్నాడు. ఐపీఎల్ మెగా వేలానికి ముందు నటరాజన్‌ను రూ.4 కోట్లకు ఎస్ఆర్హెచ్ రీటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక మార్చి 26 నుంచి ఐపీఎల్ మహా సంగ్రామానికి తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో కోలకతా నైట్రైడెర్స్ తలపడనుంది. చదవండి: IPL 2022: చెన్నై అభిమానులకు గుడ్ న్యూస్.. స్టార్ ఓపెనర్ వచ్చేశాడు! View this post on Instagram A post shared by SunRisers Hyderabad (@sunrisershyd) -
IND Squad For WI Series: యార్కర్ల 'నట్టూ' ఏమైనట్టు..?
త్వరలో విండీస్‌తో స్వదేశంలో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టుపై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 3 వన్డేలు, 3 టీ20ల ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన టీమిండియా పర్ఫెక్ట్గా ఉందని కొందరంటుంటే, రిషి ధవన్, షారుఖ్ ఖాన్, దేవ్‌దత్ పడిక్కల్ లాంటి అర్హులైన క్రికెటర్లకు అన్యాయం జరిగిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో సత్తా చాటి గాయాల కారణంగా కనుమరుగైన ఓ యువ క్రికెటర్ పేరు తెరపైకి వచ్చింది. అతనే తంగరసు నటరాజన్. ఐపీఎల్ 2020 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అనామక బౌలర్‌గా బరిలోకి దిగి యార్కర్లతో గడగడలాడించిన అతను.. ఆ తర్వాత టీమిండియా తరఫున కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడి జట్టుకు దూరమయ్యాడు. తాజాగా విండీస్‌తో సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో అతని పేరు లేకపోవడంతో నట్టూకు ఏమైనట్టు.. అతను ఎక్కడున్నాడు..? అంటూ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. బీసీసీఐ అందించిన సమాచారం మేరకు.. టీమిండియాలో ఫాస్ట్ బౌలింగ్ స్లాట్ కోసం తీవ్ర పోటీ నెలకొందని, నట్టూ జట్టులోకి తిరిగి రావాలంటే దేశవాళీ టోర్నీల్లో రాణించి సత్తా చాటాల్సి ఉంటుంది. 2021 ఐపీఎల్‌కి ముందు ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్ సందర్భంగా గాయపడ్డ నట్టూ.. ఐపీఎల్ ఫస్టాఫ్‌కు దూరమయ్యాడు. అనంతరం దుబాయ్‌లో జరిగిన సెకండాఫ్ సమయానికి కోలుకున్నప్పటికీ.. కరోనా బారిన పడడంతో లీగ్ మొత్తానికి దూరమయ్యాడు. అనంతరం దేశవాళీ టోర్నీల్లో పాల్గొన్నా ఇంతకుముందులా మెరవకపోవడంతో అతనికి టీమిండియా నుంచి పిలుపు రాలేదు. కాగా, తమిళనాడుకు చెందిన దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన నటరాజన్.. ఐపీఎల్ 2020 సీజన్లో ఎస్ఆర్హెచ్ తరఫున ఒకే ఓవర్లో ఆరుకి ఆరు యార్కర్లు వేసి.. క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. అనంతరం ఆస్ట్రేలియా టూర్‌కి లక్కీగా(వరుణ్ చక్రవర్తి గాయపడడంతో) ఎంపికైన అతను.. టీ20 సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు తీసి టీమిండియాకి సిరీస్ విజయాన్ని అందించాడు. ఈ సిరీస్‌లో నట్టూ.. ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. అనంతరం జరిగిన టెస్ట్ సిరీస్‌లో కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటంతో గబ్బాలో టెస్ట్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. కెరీర్లో ఓ టెస్ట్, 2 వన్డేలు, 4 టీ20 ఆడిన నటరాజన్.. మొత్తం 13 వికెట్లు సాధించాడు. ఐపీఎల్లో 24 మ్యాచ్‌ల్లో 20 వికెట్లతో సత్తా చాటాడు. చదవండి: ఐపీఎల్ ఆడకపోవడమే అతను చేసిన నేరమా.. అందుకే టీమిండియాకు ఎంపిక చేయలేదా..?