CSK vs SRH: Umran Malik set to RETURN, Natarajan faces AXE - Sakshi
Sakshi News home page

IPL 2023: చెన్నైతో మ్యాచ్‌.. సన్‌రైజర్స్‌ జట్టులో కీలక మార్పు! యార్కర్ల కింగ్‌కు నో ఛాన్స్‌

Published Fri, Apr 21 2023 11:32 AM | Last Updated on Fri, Apr 21 2023 12:10 PM

CSKvs vs SRH Umran Malik set to RETURN vsCsk, Natarajan faces AXE - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2023లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు సీఎస్‌కే రూపంలో మరో గట్టి సవాలు ఎదురుకానుంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా శుక్రవారం(ఏప్రిల్‌ 21) పటిష్టంగా ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఎస్‌ఆర్‌హెచ్‌ తలపడనుంది. కాగా ఎస్‌ఆర్‌హెచ్‌ తమ చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే గత మ్యాచ్‌లో తప్పిదాలను రిపీట్‌ చేయకుండా.. సీఎస్‌కే గట్టి పోటీ ఇవ్వాలని మార్‌క్రమ్‌ సేన భావిస్తోంది.

ఇక చెన్నైతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఒకే మార్పుతో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. గత మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన స్టార్‌ పేసర్‌ టి నటరాజన్‌ స్థానంలో ఉమ్రాన్‌ మాలిక్‌కు ఛాన్స్‌ ఇవ్వాలని ఎస్‌ఆర్‌హెచ్‌ మేనెజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఉప్పల్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నటరాజన్‌ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో నటరాజన్‌ ఏకంగా 50 పరుగులు ఇచ్చాడు. అదే విధంగా ఈ మ్యాచ్‌కు స్పీడ్‌ స్టార్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ పక్కన పెట్టింది. 

అయితే నటరాజన్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ మేనెజ్‌మెంట్‌ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో నటరాజన్‌ను కాదని ఉమ్రాన్‌ వైపే ఎస్‌ఆర్‌హెచ్‌ మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక చివరగా ఆర్సీబీ మీద గెలిచి మంచి జోష్‌ మీద ఉన్న సీఎస్‌కేను ఆరెంజ్‌ ఆర్మీ ఎంతవరకు అడ్డుకుంటుందో వేచి చూడాలి. 

ఎస్‌ఆర్‌హెచ్‌ తుది జట్టు(అంచనా)
హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, మార్కో జానెసన్‌, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్‌ మాలిక్‌, మయాంక్ మార్కండే

చదవండి: IPL 2023: సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌.. చెన్నైకి గుడ్‌ న్యూస్‌! 16 కోట్ల ఆటగాడు రెడీ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement