
PC: IPL.com
ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ తమ విజయాల పరంపరను కొనసాగిస్తోంది. చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో సీఎస్‌కే ఘన విజయం సాధించింది. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లో నాలుగు విజయాలతో సీఎస్‌కే పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఇక తమ హోం గ్రౌండ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై విజయం సాధించడంపై సీఎస్‌కే కెప్టెన్ ధోని స్పందించాడు. ఆ జట్టు యువ పేసర్ మతీషా పతిరనపై ధోని ప్రశంసల వర్షం కురిపించాడు.
పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో ధోని మాట్లాడుతూ.. "నేను నా కెరీర్‌లో చివర దశలో ఉన్నాను. ఆ విషయం నాకు బాగా తెలుసు. కాబట్టి ప్రతీ మ్యాచ్‌ను నేను ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నాను. నాకు చెన్నైతో విడదీయరాని అనుబంధం ఉంది. వారు నాపై చూపిస్తున్న ప్రేమ,అభిమానాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇక ఈ ఏడాది సీజన్‌లో ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రావడం లేదు. కానీ మ్యాచ్‌ల్లో మేము విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది.
ఈ మ్యాచ్‌లో మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా పతిరన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అతడు బౌలింగ్ యాక్షన్ అద్భుతంగా ఉంది. అతడిని బ్యాటర్లు ఎదుర్కొవడం అంత సులభం కాదు. పతిరనా అచ్చం మలింగా బౌలింగ్ యాక్షన్‌ను పోలి ఉన్నాడు.
నేను ఎప్పుడూ ఫాస్ట్ బౌలర్లకు సపోర్ట్‌గా ఉంటాను. ఫీల్డ్ కూడా పేసర్లకు నచ్చిన విధంగానే సెట్‌చేస్తాను. వికెట్‌పై మంచు ప్రభావం ఉంటుందనే నేను తొలుత బౌలింగ్ ఎంచుకున్నాను. నేను ఊహించిన విధంగానే సెకెండ్ ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం కన్పించింది. కాన్వే మరోసారి క్లాస్‌ను చూపించాడు.
ఇక ఈ మ్యాచ్‌లో అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయినప్పటికీ ఈ మ్యాచ్‌లో నాకు బెస్ట్ క్యాచ్ అవార్డు రాలేదు. గతంలో రాహల్ ద్రవిడ్ కూడా అచ్చం ఇటువంటి క్యాచ్‌నే తీసుకున్నాడు. అది నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇక వయసు పెరిగితే అనుభవం వస్తుంది. నా వయసు కూడా పైబడింది. ఈ విషయం చెప్పేందుకు నేను ఏ మాత్రం సిగ్గుపడను. సచిన్‌లా 16 ఏళ్లకే కెరీర్ మొదలు పెడితే ఆటను మరింత ఆస్వాదించవచ్చు" అని పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: పేరుకే ఆల్‌రౌండర్.. జట్టులో ఎందుకు ఉన్నాడో తెలియదు! తీసి పడేయండి
Fourth #IPL2023 win in the 🎒 & #CSK are back to winning ways at 🏡
— JioCinema (@JioCinema) April 21, 2023
Which player's performance did you enjoy the most in #CSKvSRH? 💬#IPLonJioCinema #TATAIPL | @ChennaiIPL pic.twitter.com/HPgBxeFHf7