PC: IPL.com
ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి దారుణ ప్రదర్శన కనబరిచింది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి చవి చూసింది. ఇక వరుస ఓటములతో ఎస్‌ఆర్‌హెచ్ పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో కొనసాగుతుంది.
ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం రెండింట మాత్రమే సన్‌రైజర్స్ విజయం సాధించింది. ఇక సీఎస్‌కే చేతిలో ఓటమిపై ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ మ్యాచ్ అనంతరం స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఈ మ్యాచ్‌లో ఓడిపోయమని మార్‌క్రమ్ తెలిపాడు.
"ఈ టోర్నీలో మరో ఓటమి చవి చూడడం చాలా బాధగా ఉంది. ఈవెంట్‌లో ముందుకు వెళ్లాలంటే మా ఆట తీరులో మార్పులు చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇక బ్యాటింగ్ పరంగా మేము దారుణంగా విఫలమయ్యాం. ప్రత్యర్ధి ముందు కనీస టార్గెట్‌ను కూడా ఉంచలేకపోయాం. చెన్నై పిచ్ బ్యాటింగ్‌కు అద్భుతంగా ఉంది. అటువంటి వికెట్‌పై 134 మంచి టార్గెట్ కాదు. కనీసం మేము 160 పరుగులైనా సాధిస్తాము అని భావించాను. కానీ దురదృష్టవశాత్తూ మిడిల్ ఓవర్లలో భాగస్వామ్యాలను నెలకొల్పలేకపోయాం.
అందుకే నామమాత్రపు స్కోర్ మాత్రమే చేయగలిగాం. చెన్నై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. చెపాక్‌లో స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారని మాకు ముందే తెలుసు. మేము అన్ని ప్రణాళికలు సిద్దం చేసుకున్నాం. కానీ దురదృష్టవశాత్తూ మా స్పిన్నర్లు అంతగా రాణించలేకపోయారు.
ఇక రాబోయో మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ పరంగా మేము చాలా మెరుగు అవ్వాలి. జట్టులో కొంత మంది యువ ఆటగాళ్లు ఇంకా బ్యాట్‌తో రాణించాల్సిన అవసరముంది" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో మార్‌క్రమ్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: ఇదే నా చివరి ఐపీఎల్ కావొచ్చు.. అతడు అద్భుతం! నేను ఎప్పటికీ మర్చిపోను: ధోని
Comments
Please login to add a commentAdd a comment