
PC: IPL.com
ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు మరో విజయం సాధించింది. అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో9 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ విజయ కేతనం ఎగరవేసింది. దీంతో ఢిల్లీ చేతిలో గత ఓటమికి ఎస్‌ఆర్‌హెచ్ బదులు తీర్చుకోంది. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు.
తొలుత బ్యాటింగ్‌లో 67 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మ.. అనంతరం బౌలింగ్‌లో కూడా ఒక్క వికెట్ పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ ఢిల్లీ బ్యాటర్లు మిచెల్ మార్ష్, ఫిల్ సాల్ట్ చుక్కలు చూపించారు. ఢిల్లీ ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేసిన మాలిక్.. ఏకంగా 22 పరుగులు సమర్పించుకున్నాడు.
మార్ష్ రెండు సిక్స్‌లు బాదగా.. సాల్ట్ రెండు ఫోర్లు కొట్టాడు. అయితే దెబ్బకు ఉమ్రాన్‌కు మరో ఓవర్ ఇచ్చే సహాసం ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ మార్‌క్రమ్ చేయలేదు. కేవలం ఒక్క ఓవర్‌కే ఉమ్రాన్ కథ ముగిసింది. అతడి బౌలింగ్ కోటాను అభిషేక్ శర్మతో మార్‌క్రమ్ పూర్తి చేశాడు.
చదవండి: IPL 2023: అదే మా కొంపముంచింది.. అందుకే అక్షర్‌ను ముందు పంపలేదు: వార్నర్
Firebolts from Heiny 🔥😍pic.twitter.com/Y7rNqJtqHM
— SunRisers Hyderabad (@SunRisers) April 29, 2023
Comments
Please login to add a commentAdd a comment