
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ క్రికెటర్ ఒకరు మద్యం మత్తులో ఓ మహిళతో అసభ్యంగా ప్రవరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం అనంతరం ఏర్పాటు చేసిన ఓ నైట్‌పార్టీలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ ఆటగాళ్లకు కఠిన నిబంధనలు జారీ చేసింది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ ప్రకారం.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ ప్లేయర్లు, సిబ్బందికి కఠిన ఆంక్షలు విధించింది. పార్టీలో ఢిల్లీ ప్లేయర్ ఓ మహిళతో అనుచితంగా ప్రవర్తించిడంతో ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఢిల్లీ ఆటగాళ్లు రాత్రి 10 గంటల తర్వాత తమ గదులలోకి బయటవ్యక్తులను అనుమతించకూడదు. అదే విధంగా ఏ సమయంలోనైనా హోటల్ గదిలో ఆటగాళ్లను కలవాలంటే ఫోటో గుర్తింపు కార్డుతో పాటు ఐపీఎల్ టీమ్ ఇంటిగ్రిటీ ఆఫీసర్ నుంచి అనుమతి పొందాలి.
ఢిల్లీ తీసుకువచ్చిన నియమావళి ఇదే
►రాత్రి 10 గంటల తర్వాత బయటి వ్యక్తులు ఎవరూ ఆటగాళ్ల గదుల్లో రాకూడదు.
►అతిథులను గదిలోకి ప్రవేశించాలంటే ఖచ్చింతంగా ఫోటో గుర్తింపు కార్డుతో పాటు ఐపీఎల్ టీమ్ ఇంటిగ్రిటీ ఆఫీసర్ నుంచి అనుమతి అవసరం
►హోటల్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా ఫ్రాంచైజీకి తెలియజేయాలి.
►ఆటగాళ్ల సతీమణులు, గార్ల్‌ఫ్రెండ్స్‌కు అనుమతి ఉన్నా, వారి ఖర్చులను ఆటగాళ్లే భరించాలి.
►ఆటగాళ్లందరూ తప్పనిసరిగా ఫ్రాంచైజీ కార్యక్రమాలకు కచ్చితంగా హాజరు కావాలి
►నిబంధనలను ఉల్లంఘించిన ఆటగాళ్లపై కఠిన చర్యలు ఉంటాయి. కాంట్రాక్ట్‌ను కూడా రద్దు చేసే ఛాన్స్ ఉంది.
చదవండి: IPL 2023 RCB Vs KKR: కోహ్లి కాలికి దండం పెట్టిన రింకూ సింగ్.. ఫోటోలు వైరల్