PC: IPL.com
ఐపీఎల్-2023లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్, ఢిల్లీ క్యాపిటల్స్ వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ పటేల్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. తొలుత బ్యాటింగ్‌లో 34 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన అక్షర్.. తర్వాత బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు.
ఢిల్లీ విజయం సాధించడంలో అక్షర్ పటేల్ ముఖ్య పాత్ర పోషించాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన అక్షర్ పటేల్‌పై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహించే సత్తా అక్షర్‌పటేల్‌కు ఉందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ ఏడాది సీజన్‌కు రిషబ్ పంత్ దూరం కావడంతో ఢిల్లీ కెప్టెన్సీ బాధ్యతలు డేవిడ్ వార్నర్ చేపట్టాడు. వార్నర్‌కు డిప్యూటీగా అక్షర్ పటేల్ వ్యవహరిస్తున్నాడు.
"అక్షర్ పటేల్ అద్భుతమైన ఆల్‌రౌండర్. అతడికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి అక్షర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా నియమించాలి. అతడో నిజాయతీ గల ఆటగాడు. అదే విధంగా మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతన్ని కెప్టెన్ గా చేసి, బాగా రాణించగలిగితే భారత జట్టుకు కూడా మేలు జరుగుతుంది" అని స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ లైవ్ లో గవాస్కర్ పేర్కొన్నాడు. ఇక ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన అక్షర్.. 182 పరుగులతో పాటు 6వికెట్లు సాధించాడు.
చదవండి: IPL 2023: డేవిడ్ వార్నర్‌కు బిగ్ షాక్.. భారీ జరిమానా! ఎంతంటే?
Comments
Please login to add a commentAdd a comment