IPL 2023: DC vs SRH Match 40 Playing XI, Prediction - Sakshi
Sakshi News home page

IPL 2023: ఢిల్లీతో మ్యాచ్‌.. సన్‌రైజర్స్‌ జట్టులో కీలక మార్పులు! ఆంధ్ర ఆటగాడు ఎంట్రీ

Published Sat, Apr 29 2023 4:07 PM | Last Updated on Sat, Apr 29 2023 4:26 PM

IPL 2023: DC vs SRH Playing XI Prediction - Sakshi

Photo Credit : IPL Website

ఐపీఎల్‌-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మరోసారి ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడేందుకు సిద్దమైంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా శనివారం ఎస్‌ఆర్‌హెచ్‌, ఢిల్లీ జట్లు తలపడనున్నాయి. వరుసగా రెండు విజయాలు సాధించి మంచి జోష్‌ మీద ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్.. అదే జోరును మ్యాచ్‌లో కూడా కొనసాగించాలని భావిస్తోంది. 

మరోవైపు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి గత ఓటమికి బదులు తీర్చుకోవాలని సన్‌రైజర్స్‌ భావిస్తోంది. కాగా ఉప్పల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించిన సంగతి తెలిసిందే.  ఇక ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ రెండు మార్పులతో బరిలోకి దిగే ఛాన్స్‌ ఉంది. 

ఆంధ్ర ఆల్‌రౌండర్‌ ఎంట్రీ
వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీష్‌ రెడ్డి అవకాశం ఇవ్వాలని ఎస్‌ఆర్‌హెచ్‌ మేనెజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా అభిషేక్‌ శర్మ స్థానంలో అబ్దుల్‌ సమద్‌ తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు వాషింగ్టన్‌ సుందర్‌ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. మరోవైపు ఢిల్లీ క్యాపిటిల్స్‌  ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే చాన్స్‌ ఉంది.

తుది జట్లు(అంచనా)

ఎస్‌ఆర్‌హెచ్‌
మయాంక్ అగర్వాల్, హ్యరీ బ్రూక్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్‌),హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌ కీపర్‌), మార్కో జాన్సెన్, అబ్దుల్ సమద్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, నితీష్‌ రెడ్డి

ఢిల్లీ క్యాపిటల్స్‌: ఫిలిప్ సాల్ట్ (వికెట్‌ కీపకర్‌), మిచెల్ మార్ష్, మనీష్ పాండే, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, రిపాల్ పటేల్, అన్రిచ్ నార్ట్జే, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement