టీ20 వరల్డ్‌కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టులో కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్, రింకూ సింగ్‌లు వంటి స్టార్ ఆటగాళ్లకి భారత సెలక్షన్ కమిటీ చోటుఇవ్వలేదు.
ముఖ్యంగా టీ20ల్లో టీమిండియా నయా ఫినిషర్‌గా మారిన రింకూ సింగ్‌ను సెలక్టర్లు ఎంపిక చేయకపోవడం అందరిని షాక్‌కు గురిచేసింది. మరోవైపు జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్‌లతో బంతిని పంచుకునే మూడో పేసర్‌గా అర్ష్‌దీప్ సింగ్‌ను సెలక్టర్లు అనూహ్యంగా ఎంపిక చేశారు.
ఐపీఎల్-2024లో నామమాత్రపు ప్రదర్శన చేస్తున్న అర్ష్‌దీప్‌ను ఎంపిక చేయడం పట్ల భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఆసీస్ క్రికెట్ దిగ్గజం షేన్ వాట్సన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత వరల్డ్‌కప్ జట్టులో మూడో పేసర్‌గా ఎస్‌ఆర్‌హెచ్ ఫాస్ట్ బౌలర్ టి నటరాజన్ చోటుదక్కుతుందని తను భావించినట్లు వాట్సన్ తెలిపాడు.
"నటరాజన్‌కు భారత టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. నటరాజన్ యార్కర్లను అద్బుతంగా బౌలింగ్ చేయగలడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో అతడు నిలికడగా రాణిస్తున్నాడు. అతడి బౌలింగ్‌లో వేరియషన్స్ కూడా ఉంటాయి. క్లిష్టపరిస్థితుల్లో తన బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పే సత్తా నట్టూకు ఉందని" ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాట్సన్ పేర్కొన్నాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన నటరాజన్.. 15 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment