టీ20 వరల్డ్‌కప్-2024కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మరో 48 గంటల్లో ప్రకటించనుంది. ఈ జట్టులో ఎవరికి చోటు దక్కుతుందా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఐపీఎల్-2024లో ఆటగాళ్ల ప్రదర్శనను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోకున్నారు. వరల్డ్‌కప్ జట్టులో కొన్ని అనూహ్య ఎంపికలు ఉండే అవకాశముందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్ కోసం వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఎంచుకున్నాడు.
తన జట్టులో టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్, నయా ఫినిషర్ రింకూ సింగ్, స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌లకు చోటు ఇవ్వలేదు. లారా తన జట్టులో టాప్ ఆర్డర్ బ్యాటర్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్‌కు ఛాన్స్ ఇచ్చాడు.
అదే విధంగా స్పెషలిస్ట్ వికెట్ కీపర్ల కోటాలో సంజూ శాంసన్, రిషబ్ పంత్‌లను లారా ఎంపిక చేశాడు. ఆల్‌రౌండర్లగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివమ్ దూబేలకు చోటు దక్కింది.
ఇక ఫాస్ట్ బౌలర్ల కోటాలో అనూహ్యంగా సందీప్ శర్మను లారా ఎంపిక చేశాడు. అతడితో పాటు పేస్ సంచలనం మయాంక్ యాదవ్‌కు సైతం లారా అవకాశమిచ్చాడు.
వీరిద్దరితో పాటు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లకు ఫాస్ట్ బౌలర్లగా బ్రియాన్ ఎంపిక చేశాడు. ఇక చివరగా లారా జట్టులో స్పిన్నర్లగా కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ చోటు దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment