టీ20 వరల్డ్‌కప్-2024కు అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా క్రికెట్ టోర్నీ జూన్ 1 నుంచి 29 వరకు జరగనుంది. ఈ పొట్టి ప్రపంచకప్ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇప్పటికే విడుదల చేసింది.
ఈ మెగా ఈవెంట్‌లో జూన్ 5న ఐర్లాండ్‌తో జరగనున్న మ్యాచ్‌తో టీమిండియా తమ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ క్రమంలో టీ20 వరల్డ్‌కప్‌ను భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఏప్రిల్ చివరి వారంలో ప్రకటించే అవకాశముంది.
ఐపీఎల్-2024లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోనే సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. అయితే ఐపీఎల్ ఆరంభానికి ముందు టీ20 వరల్డ్‌కప్ జట్టు నుంచి టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిని తప్పించనున్నట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. టీ20ల్లో యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించేందుకు కోహ్లిని పక్కన పెట్టాలని మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొన్నాయి.
అయితే అవన్నీ రూమర్సే అని, టీ20 వరల్డ్‌కప్ జట్టు ఎంపికలో కోహ్లి ముందు వరుసలో ఉన్నాడని ప్రముఖ క్రీడా వెబ్ సైట్ క్రిక్‌బజ్ తమ తాజా రిపోర్ట్‌లో పేర్కొంది. కాగా కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్-2024లో ఆర్సీబీ తరపున దుమ్ములేపుతున్నాడు.
కేవలం 5 మ్యాచ్‌ల్లోనే ఓ సెంచరీ సాయంతో 316 పరుగులు చేసి లీడింగ్ రన్‌స్కోరర్‌గా విరాట్ కొనసాగుతున్నాడు. ఇటువంటి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆటగాడిని సెలక్టర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపిక చేయకుండా వదిలేయరని క్రిక్‌బజ్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment