భారత్ మొత్తం ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో టీమిండియా ఆటగాళ్లు మొత్తం బీజీబీజీగా ఉన్నారు. ఈ టోర్నమెంట్ మార్చి 22 నుండి మే 26 వరకు జరగనుంది. ఐపీఎల్ ముగిసిన నాలుగు రోజులకే మరో క్రికెట్ మహాసంగ్రామానికి తెర లేవనుంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా టీ20 వరల్డ్‌కప్ 2024 ప్రారంభం కానుంది.
ఈ మెగా టోర్నీలో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు ప్రకటనకు ముహర్తం ఖారారైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్ చివరి వారంలో భారత జట్టు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించనున్నట్లు పీటీఐ తమ రిపోర్ట్‌లో పేర్కొంది.
"ఏప్రిల్ చివరి వారంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ మీటింగ్‌లో టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టును సెలక్టర్లు ఎంపిక చేయనున్నారు. అప్పటికి ఐపీఎల్ తొలి దశ ముగిస్తోంది. కాబట్టి జట్టులో చోటు కోసం పోటీపడే ఆటగాళ్ల ఫామ్‌ను, ఫిట్‌నెస్‌ను సెలక్టర్లు అంచనా వేసే ఛాన్స్ ఉందని" బీసీసీఐ వర్గాలు పీటీఐతో వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment