Hardik Pandya Vacation Photos: భార్యతో విడాకులు?.. విదేశాల్లో హార్దిక్ పాండ్యా ఒక్కడే!
Published Mon, May 27 2024 5:42 PM | Last Updated on Mon, May 27 2024 6:15 PM
టీ20 వరల్డ్‌కప్-2024 కోసం టీమిండియా తొలి బ్యాచ్ అమెరికా గడ్డపై అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, శుబ్‌మన్ గిల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ తదితరులు మొదటి విడతగా ఆదివారం అమెరికాకు చేరుకున్నారు.
ఇక రెండో బ్యాచ్‌లో భారత స్టార్ విరాట్ కోహ్లి, రింకూ సింగ్, సంజూ శాంసన్, చాహల్ మంగళవారం అమెరికా వెళ్లే విమానం ఎక్కనున్నట్లు తెలుస్తోంది. అయితే భారత వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాత్రం రెండో బ్యాచ్‌తో కూడా అమెరికాకు వెళ్లేందుకు సిద్దంగా లేనిట్లు సమాచారం.
పాండ్యా జట్టుతో కలిసేందుకు మరి కొంత సమయం పట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా గత కొన్ని రోజులుగా హార్దిక్ పాండ్యా-తన భార్య నటాసా స్టాంకోవిక్ విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలపై హార్దిక్ గానీ, నటాసా గానీ ఇప్పటివరకు స్పందించలేదు.
అయితే ఐపీఎల్-2024లో ఆటగాడిగా, కెప్టెన్‌గా ఘోర పరాభావం పొందిన పాండ్యా.. ప్రస్తుతం ఒంటరిగా విదేశాలకు వెకేషన్‌కు వెళ్లినట్లు ప్రముఖ క్రీడా వెబ్‌సైట్ క్రిక్‌బజ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. హార్దిక్ ఎక్కడ ఉన్నాడో తెలియదు గానీ ఫారెన్‌లో సేదతీరుతున్నట్లు క్రిక్‌బజ్ తెలిపింది.
హార్దిక్ కూడా సైతం తన స్విమ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఎక్కడ ఉన్నాన్నది హార్దిక్ చెప్పలేదు. అయితూ హార్దిక్ షేర్ చేసిన ఫోటోలలో తనక్కొడే ఉండడంతో విడాకుల రూమర్స్‌కు మరింత ఊతమిచ్చినట్లైంది.
పాండ్యా ఫారెన్‌లో ఉన్నప్పటికి నేరుగా త్వరలోనే న్యూయర్క్‌లో ఉన్న భారత జట్టుతో కలవనున్నట్లు మరి కొన్ని రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. కాగా టీ20 వరల్డ్‌కప్-2024 జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా ప్రారంభం కానుంది. భారత తమ తొలి మ్యాచ్‌లో జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడనుంది.
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment