Kane Williamson Hits Gigantic Six Off T Natarajan During SRH Practice Match - Sakshi
Sakshi News home page

IPL 2022: నటరాజన్‌ బౌలింగ్.. భారీ సిక్స్‌ బాదిన విలియమ్సన్.. వీడియో వైరల్‌!

Published Mon, Mar 21 2022 8:53 PM | Last Updated on Tue, Mar 22 2022 11:06 AM

Kane Williamson hits gigantic six off T Natarajan during SRH Practice match - Sakshi

PC: IPL Titter

క్రికెట్‌ అభిమానులు ఎంతో  ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ మహా సంగ్రామానికి మరి కొద్ది రోజుల్లో తెర లేవనుంది. మార్చి 26 నుంచి ఐపీఎల్‌-2022 ప్రారంభం కానుంది. దీంతో ఆయా జట్లు ప్రాక్టీస్‌ సెషన్స్‌లో బీజీగా గడుపుతున్నాయి. ఈ క్రమంలో సన్‌రైజెర్స్‌ హైదరాబాద్‌ జట్టు సైతం తీవ్రంగా శ్రమిస్తోంది. సన్నాహాల్లో భాగంగా చెపాక్ స్టేడియంలో ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ సన్‌రైజెర్స్‌ హైదరాబాద్‌ ఆడింది.

ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ రెండు జట్లుగా విడిపోయింది. అయితే ఆ జట్టు స్టార్‌ బౌలర్‌ నటరాజన్‌ బౌలింగ్‌ చేయగా.. సన్‌రైజెర్స్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్ భారీ సిక్స్‌ బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎస్‌ఆర్‌హెచ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. కాగా గాయం కారణంగా గత కొంత కాలంగా విలియమ్స్‌ ఏ విధమైన క్రికెట్‌ ఆడలేదు.

అయితే అతడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించి ఈ మెగా టోర్నీకు సిద్దమయ్యాడు. ఈ సీజన్‌లో సన్‌రైజెర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు హెడ్‌ కోచ్‌గా టామ్‌ మూడీ, బ్యాటింగ్‌ కోచ్‌గా బ్రియాన్‌ లారా, బౌలింగ్‌ కోచ్‌గా డెల్‌ స్టెయిన్‌ వ్యవహరించనున్నారు. మరో వైపు ఐపీఎల్‌ మెగా వేలంలో పూరన్‌, రొమారియో షెపర్డ్ వంటి స్టార్‌ ఆటగాళ్లను ఎస్‌ఆర్‌హెచ్‌ కొనుగోలు చేసింది. ఇక మార్చి 29 న ఎస్‌ఆర్‌హెచ్‌ తన తొలి మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ను ఢీకొట్టనుంది.

చదవండి: IPL 2022: షాట్లతో అలరించిన రిషభ్‌ పంత్‌.. రెప్పవాల్చని యువ ఆటగాళ్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement