కేన్ విలియమ్సన్- ఇర్ఫాన్ పఠాన్
IPL Mini Auction 2023- Sunrisers Hyderabad: ఐపీఎల్ మినీ వేలం-2023కి సమయం దగ్గరపడింది. కొచ్చి వేదికగా శుక్రవారం(డిసెంబరు 23)న ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీలు ఆటగాళ్ల కొనుగోలు అంశంపై ప్రణాళికలు సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనింగ్ స్థానం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కాగా న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ సారథ్యంలోని సన్‌రైజర్స్ జట్టు గతేడాది దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఆడిన 14 మ్యాచ్‌లకు గానూ ఆరింట మాత్రమే గెలిచి.. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. దీంతో కేన్ మామ కోసం గతంలో 14 కోట్ల భారీ పెట్టిన ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం మినీ వేలానికి ముందు అతడితో బంధం తెంచుకుంది.
మయాంక్ అగర్వాల్
కేన్ మామ స్థానాన్ని భర్తీ చేసేది అతడే
ఈ నేపథ్యంలో విలియమ్సన్ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడు ఇతడేనంటూ ఇర్ఫాన్ పఠాన్ టీమిండియా క్రికెటర్ పేరును సూచించాడు. స్టార్ స్పోర్ట్స్ గేమ్ ప్లాన్ షోలో అతడు మాట్లాడుతూ.. ‘‘ఎస్‌ఆర్‌హెచ్ మయాంక్ అగర్వాల్‌ను కొనుగోలు చేస్తుందని అనుకుంటున్నా.
ఎందుకంటే వాళ్లకు.. దూకుడుగా ఆడగల ఓపెనర్ అవసరం ఎంతగానో ఉంది. అంతేకాదు గతంలో కెప్టెన్‌గా వ్యవహరించిన కేన్ విలియమ్సన్ కూడా ఇప్పుడు లేడు. అనుభవజ్ఞుడైన, ఓపెనింగ్ బ్యాటర్ కేన్ సేవలను ఎస్‌ఆర్‌హెచ్ కచ్చితంగా మిస్సవుతుంది.
కాబట్టి కేన్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. ఓపెనర్‌గా తను దూకుడు ప్రదర్శించగలడు. జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడగలడు. బహుశా వాళ్లు అతడిని తమ కెప్టెన్‌గా చేసే ఆలోచనలో కూడా ఉన్నారేమో!’’ అని చెప్పుకొచ్చాడు.
కాగా గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన మయాంక్ ప్రస్తుతం కోటి రూపాయల కనీస ధరతో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఇక సారథిగా నియమించిన సమయంలో మయాంక్ కోసం పంజాబ్ 14 కోట్లు వెచ్చించగా.. ఈసారి అతడు ఎంత ధరకు అమ్ముడుపోతాడనే విషయం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ నిజంగానే సన్‌రైజర్స్ మయాంక్‌ను కొనుగోలు చేస్తే ఓపెనింగ్ స్థానానికి చక్కటి ఆప్షన్ దొరుకుతుంది.
చదవండి: IPL 2023 Mini Auction Players List: వేలంలో 405 మంది ఆటగాళ్లు.. షార్ట్‌లిస్ట్ చేసిన ఫ్రాంచైజీలు
IPL Mini Auction: వేలంలో 991 మంది క్రికెటర్లు! పాపం.. టీమిండియా ఆటగాళ్లు.. కనీసం 2 కోట్లు కూడా!
వచ్చీ రాగానే మొదలెట్టేశాడు.. సూర్యకుమార్ ఊచకోత కొనసాగింపు
Comments
Please login to add a commentAdd a comment