Sunrisers Hyderabad Unveil Their New Jersey For IPL 2023, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2023: కొత్త సీజన్‌.. కొత్త కెప్టెన్‌.. సన్‌రైజర్స్‌ కొత్త జెర్సీ అదిరిపోయిందిగా!

Published Thu, Mar 16 2023 2:37 PM | Last Updated on Thu, Mar 16 2023 3:10 PM

Sunrisers Hyderabad Unveil Jersey For IPL 2023. See Pics - Sakshi

క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ 16వ సీజన్‌కు మరో రెండు వారాల్లో తెరలేవనుంది. ఈ ఏడాది సీజన్‌ ఆరంభానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు ఒకొక్కటిగా తమ కొత్త జెర్సీలను విడుదల చేస్తున్నాయి.

తాజాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తమ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఆ జట్టు స్టార్‌ క్రికెటర్లు మయాంక్ అగర్వాల్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్‌లు తమ కొత్త జెర్సీని ధరించి ఉన్న ఫోటోలను సన్‌రైజర్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అదే విధంగా ఇందుకు సంబంధిం‍చిన ఓ వీడియోను కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులతో పంచుకుంది.

కాగా ఎస్‌ఆర్‌హెచ్‌ తమ పాత జెర్సీలో పూర్తి స్థాయిలో మార్పులు చేయకుండా.. కాషాయానికి కాస్త నల్లరంగును అద్దింది. అదే విధంగా ఆరంజ్ కలర్ లో ఉన్న ట్రాక్‌ ప్యాంటు స్థానంలో  పూర్తి బ్లాక్ కలర్ ప్యాంటు తీసుకొచ్చారు. కాగా ఆరెంజ్‌ ఆర్మీ కొత్త జెర్సీ.. మొట్టమొదటి సౌతాఫ్రికా20 లీగ్‌లో టైటిల్ నెగ్గిన సన్‌రైజర్స్ ఈస్ట్రరన్ కేప్ జెర్సీని పోలి ఉంది.

ఇక ఈ ఏడాది సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ తమ కొత్త కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ ఐడెన్ మార్కరమ్‌ను ఎంపిక చేసింది. అతని సారథ్యంలోని సన్ రైజర్స్ ఈస్ట్రరన్ కేప్ జట్టు తొట్ట తొలి సౌతాఫ్రికా20 లీగ్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 

చదవండి: IPL 2023: శ్రేయస్‌ అయ్యర్ దూరం..! కేకేఆర్ కొత్త కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement