IPL 2025: సన్‌రైజర్స్‌ రీటైన్‌ చేసుకున్న ఆటగాళ్లు వీరే..! | IPL 2025 Retention: Sunrisers Hyderabad Full List Of Retained And Released Players | Sakshi
Sakshi News home page

IPL 2025: సన్‌రైజర్స్‌ రీటైన్‌ చేసుకున్న ఆటగాళ్లు వీరే..!

Published Thu, Oct 31 2024 8:03 PM | Last Updated on Thu, Oct 31 2024 8:03 PM

IPL 2025 Retention: Sunrisers Hyderabad Full List Of Retained And Released Players

ఐపీఎల్‌ 2025 సీజన్‌కు సంబంధించి రిటెన్షన్స్‌ జాబితాను ఇవాళ (అక్టోబర్‌ 31) విడుదల చేశారు. మెజార్టీ శాతం ఫ్రాంచైజీలు ఊహించిన విధంగానే ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. కొన్ని ఫ్రాంచైజీలు మాత్రం కెప్టెన్లను వదిలేసి పెద్ద సాహసం చేశాయి.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విషయానికొస్తే.. ఆరెంజ్‌ ఆర్మీ సాధ్యమైనంత వరకు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ జట్టు కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ (18 కోట్లు), అభిషేక్‌ శర్మ (14 కోట్లు), నితీశ్‌కుమార్‌ రెడ్డి (6 కోట్లు), హెన్రిచ్‌ క్లాసెన్‌ (23 కోట్లు), ట్రవిస్‌ హెడ్‌ (14 కోట్లు) మరోసారి రిటైన్‌ చేసుకుంది.

ఫ్రాంచైజీలకు కేవలం ఆరుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్‌ చేసుకునే వెసులుబాటు ఉండటంతో ఎస్‌ఆర్‌హెచ్‌ కొందరు స్టార్‌ ఆటగాళ్లను వదులుకోవాల్సి వచ్చింది. ఇందులో ఎయిడెన్‌ మార్క్రమ్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, భువనేశ్వర్‌ కుమార్‌, నటరాజన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, అబ్దుల్‌ సమద్‌, మార్కో జన్సెన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ ఉన్నారు. ఎవరూ ఊహించని విధంగా కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ కంటే హెన్రిచ్‌ క్లాసెన్‌కు అధిక ధర లభించింది. రిటెన్షన్‌ లిస్ట్‌లో అత్యధిక ధర లభించింది కూడా క్లాసెన్‌కే.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లు 

పాట్‌ కమిన్స్‌- రూ. 18 కోట్లు
అభిషేక్‌ శర్మ- రూ. 14 కోట్లు
నితీశ్‌కుమార్‌ రెడ్డి- రూ. 6 కోట్లు
హెన్రిచ్‌ క్లాసెన్‌- రూ. 23 కోట్లు
ట్రవిస్‌ హెడ్‌- రూ. 14 కోట్లు

టోటల్‌ పర్స్‌ వాల్యూ- రూ. 120 కోట్లు
మిగిలిన పర్స్‌ వాల్యూ- రూ. 45 కోట్లు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వదులుకున్న ఆటగాళ్లు 

గ్లెన్‌ ఫిలిప్స్‌
రాహుల్‌ త్రిపాఠి
ఎయిడెన్‌ మార్క్రమ్‌
మయాంక్‌ అగర్వాల్‌
అబ్దుల్‌ సమద్‌
అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌
వాషింగ్టన్‌ సుందర్‌
షాబాజ్‌ అహ్మద్‌
సన్వీర్‌ సింగ్‌
మార్కో జన్సెన్‌
ఉపేంద్ర యాదవ్‌
జయదేవ్‌ ఉనద్కత్‌
టి నటరాజన్‌
జఠావేద్‌ సుబ్రమణ్యన్‌
మయాంక్‌ మార్కండే
భువనేశ్వర్‌ కుమార్‌
ఫజల్‌ హక్‌ ఫారూఖీ
ఆకాశ్‌ మహారాజ్‌ సింగ్‌
ఉమ్రాన్‌ మాలిక్‌
విజయ్‌కాంత్‌ వియాస్‌కాంత్‌

చదవండి: ఐపీఎల్‌ 2025 రిటెన్షన్‌ జాబితా విడుదల

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement