ఐపీఎల్ 2024 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. కేకేఆర్, సన్‌రైజర్స్ మధ్య నేడు (మే 26) జరుగబోయే ఫైనల్‌తో ఐపీఎల్ 17వ సీజన్ విజేత ఎవరో తేలిపోనుంది. ఈ సీజన్ గత సీజన్లకు భిన్నంగా సాగింది. బ్యాటింగ్‌కు సంబంధించి ఆల్‌టైమ్ రికార్డులు బద్దలుకావడంతో పాటు పలు సంచలన బౌలింగ్ ప్రదర్శనలు నమోదయ్యాయి. చెరి ఐదసార్లు ఛాంపియన్లైన ముంబై, సీఎస్‌కే ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు కూడా చేరకుండానే నిష్క్రమించాయి. దిగ్గజ కెప్టెన్లు రోహిత్, ధోని లేకుండా జరుగుతున్న ఐదో ఐపీఎల్ ఫైనల్ ఇది.
ఐపీఎల్ 2024 ఫైనల్ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన 16 సీజన్లలో విజేతలు, రన్నరప్‌లపై ఓ లుక్కేద్దాం. ఇప్పటివరకు జరిగిన 16 ఫైనల్స్‌లో సీఎస్‌కే (2010, 2011, 2018, 2021, 2023), ముంబై (2013, 2015, 2017, 2019, 2020) చెరి ఐదుసార్లు టైటిల్ కైవసం చేసుకోగా.. కేకేఆర్ రెండు (2012, 2014), సన్‌రైజర్స్ (2016), రాజస్థాన్ రాయల్స్ (2008), గుజరాత్ టైటాన్స్ (2022), డెక్కన్ ఛార్జర్స్ (2009) తలో సారి టైటిల్ నెగ్గాయి. అత్యధికసార్లు రన్నరప్‌గా నిలిచిన ఘనత సీఎస్‌కేకు దక్కింది. సీఎస్‌కే ఐదుసార్లు (2008, 2012, 2013, 2015, 2019) ఫైనల్లో ఓటమిపాలైంది.
ఆతర్వాత ఆర్సీబీ మూడు సార్లు (2009, 2011, 2016).. ముంబై ఇండియన్స్ (2010), కేకేఆర్ (2021), సన్‌రైజర్స్ (2018), రాజస్థాన్ రాయల్స్ (2022), గుజరాత్ టైటాన్స్ (2023), పంజాబ్ కింగ్స్ (2014), ఢిల్లీ క్యాపిటల్స్ (2020), రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ (2017) తలో సారి రన్నరప్‌గా నిలిచాయి.
సీజన్ల వారీగా విజేతలు, రన్నరప్స్..
2008- రాజస్థాన్ రాయల్స్ (విజేత), సీఎస్‌కే (రన్నరప్)
2009- డెక్కన్ ఛార్జర్స్ (విజేత), ఆర్సీబీ (రన్నరప్)
2010- సీఎస్‌కే (విజేత), ముంబై ఇండియన్స్ (రన్నరప్)
2011- సీఎస్‌కే (విజేత), ఆర్సీబీ (రన్నరప్)
2012- కేకేఆర్ (విజేత), సీఎస్‌కే (రన్నరప్)
2013- ముంబై (విజేత), సీఎస్‌కే (రన్నరప్)
2014- కేకేఆర్ (విజేత), పంజాబ్ (రన్నరప్)
2015- ముంబై (విజేత), సీఎస్‌కే (రన్నరప్)
2016- సన్‌రైజర్స్ (విజేత), ఆర్సీబీ (రన్నరప్)
2017- ముంబై (విజేత), పూణే (రన్నరప్)
2018- సీఎస్‌కే (విజేత), సన్‌రైజర్స్ (రన్నరప్)
2019- ముంబై (విజేత), సీఎస్‌కే (రన్నరప్)
2020- ముంబై (విజేత), ఢిల్లీ (రన్నరప్)
2021- సీఎస్‌కే (విజేత), కేకేఆర్ (రన్నరప్)
2022- గుజరాత్ (విజేత), రాజస్థాన్ (రన్నరప్)
2023- సీఎస్‌కే (విజేత), గుజరాత్ (రన్నరప్)
Comments
Please login to add a commentAdd a comment