బ్యాటర్ల హవా కొనసాగుతున్న ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ బౌలర్లు ఎవరికీ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు (41 మ్యాచ్‌లు) జరిగిన మ్యాచ్‌ల్లో పంజాబ్ ఒక్కటే ఒక్కసారి కూడా ప్రత్యర్దిని 200 పరుగులు చేయనీయలేదు. ఈ సీజన్‌లో పంజాబ్ బౌలింగ్ యావరేజ్ 24.94గా ఉంది. ఏ జట్టుకు ఈ సీజన్‌లో ఇంత తక్కువ బౌలింగ్ సగటు లేదు. పంజాబ్ తర్వాత కేకేఆర్‌కు అత్యల్ప బౌలింగ్ సగటు (25.47) ఉంది. పంజాబ్ ఈ సీజన్‌లో అత్యధికంగా 199 పరుగులు ప్రత్యర్దికి సమర్పించుకుంది. ఇలా రెండు సందర్భాల్లో జరిగింది.
ఇదిలా ఉంటే, పంజాబ్ ఇవాళ (ఏప్రిల్ 26) పటిష్టమైన కేకేఆర్‌ను వారి సొంత మైదానంలో ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ పంజాబ్‌కు చాలా కీలకంగా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే పంజాబ్ ప్లే ఆఫ్స్ లెక్కల్లో ఉంటుంది. లేకపోతే మరో సీజన్‌లో ఈ జట్టు టైటిల్ లేకుండా రిక్త హస్తాలతో వైదొలగాల్సి ఉంటుంది.
పంజాబ్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. మరోవైపు కేకేఆర్ ఏడింట ఐదు మ్యాచ్‌లు గెలిచి రెండో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో కేకేఆర్ అంచనాలకు తగ్గట్టు రాణిస్తూ మూడో టైటిల్ దిశగా అడుగులు వేస్తుంది.
ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. పంజాబ్‌పై కేకేఆర్‌కు స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తూ వచ్చింది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 32 మ్యాచ్‌ల్లో తలపడగా.. కేకేఆర్ 21, పంజాబ్ 11 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.
తుది జట్లు..
కోల్‌కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్ (వికెట్‌కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, దుష్మంత చమీర, వరుణ్ చకరవర్తి, హర్షిత్ రాణా
పంజాబ్ కింగ్స్: జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రన్(కెప్టెన్), రిలీ రోసోవ్, జితేష్ శర్మ(వికెట్‌కీపర్), శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment