ఐపీఎల్– 2024లో తుది సమరానికి రంగం సిద్ధమైంది. 65 రోజులు, 73 మ్యాచ్‌ల తర్వాత ఐపీఎల్–17 విజేతను తేల్చే మ్యాచ్‌కు ఆదివారం చెన్నై వేదికవుతోంది. హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఆనందాన్ని పంచుతూ ఫైనల్ చేరిన సన్‌రైజర్స్ టీమ్ ఆఖరి పంచ్ ఇవ్వాలని పట్టుదలగా ఉంది. తొలి క్వాలిఫయర్‌లో తమను దెబ్బ తీసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇప్పుడు మళ్లీ ప్రత్యర్థి రూపంలో ఎదురుగా ఉంది. గత మ్యాచ్‌కు ప్రతీకారం తీర్చుకుంటూ రైజర్స్ చెలరేగితే రెండోసారి లీగ్ చాంపియన్‌గా సగర్వంగా నిలవవచ్చు. 2016లో ఆఖరిసారిగా టైటిల్ సాధించిన హైదరాబాద్ 2018లో ఫైనల్ చేరి తుది మెట్టుపై తడబడింది. 2012, 2014లలో ఐపీఎల్ గెలుచుకున్న కోల్‌కతా ఇప్పుడు మూడోసారి ట్రోఫీపై గురి పెట్టింది. మ్యాచ్ చెన్నైలో జరుగుతుండడంతో మన నగర అభిమానుల మనసంతా అక్కడే ఉందనేది వాస్తవం. హైదరాబాద్ గెలిస్తే సారథిగా మన నగరానికి టైటిల్ అందించిన మూడో ఆస్ట్రేలియన్‌గా కమిన్స్ నిలుస్తాడు.
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ ఫైనల్ ఆదివారం చెన్నైలో జరుగుతున్నప్పటికీ మన నగరంలోనే జరుగుతున్నంత కోలాహలం నెలకొంది. దీని కోసం నగరంలోని రెస్టారెంట్లు లైవ్ స్క్రీనింగ్ ప్రత్యేక వంటకాల ద్వారా ఈ మెగా ఈవెంట్‌కు సిద్ధమవుతున్నాయి. పలు పబ్స్, లాంజ్‌లు.. క్రికెట్ థీమ్ అలంకరణతో ఆకట్టుకుంటున్నాయి. మన సొంత జట్టు ఫైనల్‌కు చేరడంతో మరింత ఆసక్తికరంగా మారిన ఈ మ్యాచ్ నగరవాసులను ఉర్రూతలూగించనుంది. దీంతో ఎంట్రీ ఫీజు కనీసం రూ.500 నుంచి ప్రారంభించి ఆపై ధరలో విభిన్న రకాల ఆకర్షణలతో క్రికెట్ అభిమానుల్ని లైవ్ ఏర్పాట్లతో ఆహా్వనిస్తున్నారు.
గచ్చిబౌలిలోని ముస్టాంగ్ టెర్రస్ లాంజ్‌లో ఏకంగా 3 స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఎయిర్‌లైవ్‌లో 2 స్క్రీన్స్, మాదాపూర్‌లోని రష్ స్పోర్ట్స్ బార్ అండ్ బౌలింగ్ సెంటర్‌లో పెద్ద స్క్రీన్, కార్ఖానాలోని ద బార్ నెక్ట్స్ డోర్‌లో 2 బిగ్ స్క్రీన్స్‌తోపాటు చిన్నపాటి టీవీలు కూడా పూర్తిగా ఐపీఎల్ సందడికి సిద్ధమయ్యాయి. నగరంలోని పబ్స్, బార్స్, రెస్టారెంట్స్‌తో పాటు సికింద్రాబాద్ క్లబ్, జింఖానా క్లబ్, ఫిలింనగర్ క్లబ్.. వంటి సంపన్నులకు చెందిన క్లబ్స్ కూడా ప్రత్యేక ఏర్పాట్లతో సభ్యులను ఆహా్వనిస్తున్నాయి. మాల్స్, మలీ్టఫ్లెక్స్‌లూ, కెఫెలు సైతం స్క్రీన్స్ ఏర్పాటులో పోటీ పడుతున్నాయి. పలు గేటెడ్ కమ్యూనిటీల్లోనూ ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment