ఐపీఎల్-2022 తుది దశకు చేరుకుంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్‌కు ఫైనల్‌కు చేరుకోగా.. క్వాలిఫైర్-2లో శుక్రవారం రాజస్తాన్ రాయల్స్, ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. ఇది ఇలా ఉంటే.. ఈ ఏడాది సీజన్‌లో యువ లెఫ్టార్మ్ పేసర్లు తమ అత్యుత్తమ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. మొహ్సిన్ ఖాన్, టి నటరాజన్, యష్ దయాల్, ఖలీల్ అహ్మద్ వంటి లెఫ్టార్మ్ బౌలర్లు తమ జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించారు.
మొహ్సిన్ ఖాన్
ఐపీఎల్-2022లో మొహ్సిన్ ఖాన్ లక్నో సూపర్ జెయింట్స్ ప్రాతినిధ్యం వహించాడు. అయితే అతడికి టోర్నీ ఆరంభంలో పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ కొన్ని మ్యాచ్‌ల తర్వాత తుది జట్టులోకి వచ్చిన మొహ్సిన్ అదరగొట్టాడు. పేస్ బౌలింగ్‌తో జట్టులో తన స్ధానాన్ని సుస్ధిరం చేసుకున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన మొహ్సిన్ ఖాన్ 14 వికెట్లు పడగొట్టాడు.
టి నటరాజన్
సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన టి.నటరాజన్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లకు నటరాజన్ దూరమయ్యాడు. 11 మ్యాచ్‌లు ఆడిన నటరాజన్ 18 వికెట్లు తీశాడు.
ఖలీల్ అహ్మద్
ఈ ఏడాది సీజన్‌లో ఖలీల్ అహ్మద్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతనిధ్యం వహించాడు. ఢిల్లీ విజయాల్లో ఖలీల్ తన వంతు పాత్ర పోషించాడు. 10 మ్యాచ్‌లు ఆడిన ఖలీల్ 16 వికెట్లు పడగొట్టాడు.
యశ్ దయాళ్
గుజరాత్ టైటాన్స్ తరపున యశ్ దయాళ్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. డెబ్యూ సీజన్‌లోనే యశ్ ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన దయాళ్ 10 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: IPL 2022: 'బట్లర్ నాకు రెండో భర్త' .. ఎలా అంటే: రాజస్తాన్ ఆటగాడి భార్య ఆసక్తికర వాఖ్యలు !
Comments
Please login to add a commentAdd a comment