
టి నటరాజన్.. భారత క్రికెట్ టీమ్‌లో యార్కర్ కింగ్‌గా గుర్తింపు ఉంది. నేడు (ఏప్రిల్ 4) ఆయన 33వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుండటంతో తనతో పాటు ఉన్న ఆటగాళ్లతో తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో స్టార్ హీరో అజిత్ సడన్ ఎంట్రీ ఇచ్చి షాకిచ్చాడు. నటరాజన్ పుట్టినరోజు వేడుకలకు అజిత్ ఎంట్రీ ఎలా జరిగిందంటే..
ఏప్రిల్ 5న సన్‌రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో టీమ్ అంతా ఒక స్టార్ హోటల్‌లో బస చేసింది. నేడు నటరాజన్ పుట్టినరోజు కావడంతో టీమ్ సభ్యులు కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఇకపోతే సన్‌రైజర్స్ బస చేసిన హోటల్‌లోనే హీరో అజిత్ కూడా ఉన్నారు. నటరాజన్ పుట్టినరోజు విషయాన్ని తెలుసుకున్న ఆయన ఆ వేడుకల్లో హఠాత్తుగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో అజిత్‌ను చూసిన వారందరూ షాక్ అయ్యారు. ఇంతలో అజిత్ కేక్ కట్ చేసి నటరాజన్‌కు తినిపించాడు. తన అభిమాన హీరో అజిత్‌తో ఈ పుట్టినరోజు జరుపుకోవడం తన జీవితంలో మరిచిపోలేనదని నటరాజన్ పేర్కొన్నాడు.
అదే సమయంలో క్రికెట్ మాజీ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ కూడా ఉన్నారు. వారందరూ అజిత్‌తో కలిసి ఫోటోలు దిగి ఎంజాయ్ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గత కొన్నాళ్లుగా గాయాలతో బాధపడుతున్న నటరాజన్ ఈ ఏడాది ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇచ్చి బాగా ఆడుతున్నాడు.
ఐపీఎల్ 2020 సీజన్‌లో మెరిసిన యువ కిషోరం నటరాజన్. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపన రాణిస్టూ నట్టూగా పేరు పొందాడు, ఐపీఎల్‌లో యార్కర్లతో అదరగొట్టి, టీమిండియాలో ఊహించని విధంగా ఎంట్రీ ఇచ్చాడు. నెట్‌బౌలర్ నుంచి టీమ్‌ఇండియా పేసర్ స్థాయికి ఆయన ఎదిగాడు. నటరాజన్ సేలం సమీపంలోని చిన్నపంబట్టి అనే గ్రామానికి చెందినవాడు. నటరాజన్ కెరియర్ ప్రారంభంలో తన అమ్మగారు అదే గ్రామంలో కూరగాయలు అమ్ముతుండగా.. తండ్రి ఓ కూలీ. బస్సు ఎక్కేందుకు రూ.5 లేని పరిస్థితి నుంచి నేడు తమ కుటుంబాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడని ఓ సందర్భంలో తన అమ్మగారు సగర్వంగా చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment