sun risers hyderabab
-
ఏడ్చేసిన కావ్య.. ఆమెను అలా చూస్తే బాధేసింది: బిగ్ బీ
ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ జరుగుతాయా ఏంటి? ఇదీ అంతే.. ఈసారి కాకపోతే మరోసారికి చూసుకుందాం.. అని సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఎవరికి వారే ధైర్యం చెప్పుకుంటున్నారు. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్ చివరి మ్యాచులో ఎస్ఆర్హెచ్పై కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధించింది. గెలుపును మాత్రమే ఊహించిన సన్ రైజర్స్ జట్టు ఓనర్ కావ్య మారన్‌కు ఇది పెద్ద భంగపాటు అనే చెప్పాలి. కన్నీళ్లు దిగమింగుతూ..కళ్ల ముందే జట్టు కుప్పకూలిపోవడం చూసి కావ్య తట్టుకోలేకపోయింది. కన్నీళ్లను దిగమింగుకునే ప్రయత్నం చేసింది. తన వల్ల కాకపోవడంతో వెనక్కు తిరిగి కంటతడి పెట్టుకుంది. ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ వీడియోపై బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ స్పందించాడు. 'ఐపీఎల్ ముగిసింది. ఫైనల్లో కేకేఆర్ అద్భుతంగా ఆడి గెలిచింది. ఎస్ఆర్హెచ్ పేలవంగా ఆడింది. నిజానికి సన్‌రైజర్స్ మంచి టీమ్.. ఇదివరకు ఆడిన మ్యాచ్‌లలో మంచి పర్ఫామెన్స్ ఇచ్చింది. కానీ ఫైనల్లోనే నిరాశపరిచింది.ఆమెను చూస్తే బాధేసిందిమరింత బాధ కలిగించిన విషయం ఏంటంటే.. సన్ రైజర్స్ యజమానురాలు కావ్య స్టేడియంలోనే ఏడ్చేసింది. కెమెరాల కంట పడకూడదని వెనక్కి తిరిగి తన బాధను కన్నీళ్ల రూపంలో బయటకు వదిలేసింది. ఆమెను అలా చూస్తే బాధేసింది. ఇదే ముగింపు కాదు మై డియర్.. రేపు అనేది ఒకటుంది' అని తన బ్లాగ్‌లో కావ్యను ఓదార్చాడు. ఇకపోతే ప్రస్తుతం అమితాబ్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27న విడుదల కానుంది. Kavya Maran was hiding her tears. 💔- She still appreciated KKR. pic.twitter.com/KJ88qHmIg6— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2024చదవండి: సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ విన్నర్ -
సన్‌రైజర్స్ పరుగుల సునామీ.. కావ్యా మారన్ రియాక్షన్ వైరల్ (ఫొటోలు)
-
హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)
-
SRH Vs CSK Highlights Pics: సన్‌రైజర్స్‌ను చీర్ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్.. ఫొటోలు
-
IPL 2024 SRH vs CSK : ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ అభిమానులు సందడి (ఫొటోలు)
-
నటరాజన్ బర్త్‌డే వేడుకలో సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరో
టి నటరాజన్.. భారత క్రికెట్ టీమ్‌లో యార్కర్ కింగ్‌గా గుర్తింపు ఉంది. నేడు (ఏప్రిల్ 4) ఆయన 33వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుండటంతో తనతో పాటు ఉన్న ఆటగాళ్లతో తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో స్టార్ హీరో అజిత్ సడన్ ఎంట్రీ ఇచ్చి షాకిచ్చాడు. నటరాజన్ పుట్టినరోజు వేడుకలకు అజిత్ ఎంట్రీ ఎలా జరిగిందంటే.. ఏప్రిల్ 5న సన్‌రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో టీమ్ అంతా ఒక స్టార్ హోటల్లో బస చేసింది. నేడు నటరాజన్ పుట్టినరోజు కావడంతో టీమ్ సభ్యులు కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఇకపోతే సన్‌రైజర్స్ బస చేసిన హోటల్లోనే హీరో అజిత్ కూడా ఉన్నారు. నటరాజన్ పుట్టినరోజు విషయాన్ని తెలుసుకున్న ఆయన ఆ వేడుకల్లో హఠాత్తుగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో అజిత్‌ను చూసిన వారందరూ షాక్ అయ్యారు. ఇంతలో అజిత్ కేక్ కట్ చేసి నటరాజన్‌కు తినిపించాడు. తన అభిమాన హీరో అజిత్‌తో ఈ పుట్టినరోజు జరుపుకోవడం తన జీవితంలో మరిచిపోలేనదని నటరాజన్ పేర్కొన్నాడు. అదే సమయంలో క్రికెట్ మాజీ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ కూడా ఉన్నారు. వారందరూ అజిత్‌తో కలిసి ఫోటోలు దిగి ఎంజాయ్ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గత కొన్నాళ్లుగా గాయాలతో బాధపడుతున్న నటరాజన్ ఈ ఏడాది ఐపీఎల్లో రీఎంట్రీ ఇచ్చి బాగా ఆడుతున్నాడు. ఐపీఎల్ 2020 సీజన్లో మెరిసిన యువ కిషోరం నటరాజన్. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపన రాణిస్టూ నట్టూగా పేరు పొందాడు, ఐపీఎల్లో యార్కర్లతో అదరగొట్టి, టీమిండియాలో ఊహించని విధంగా ఎంట్రీ ఇచ్చాడు. నెట్‌బౌలర్ నుంచి టీమ్ఇండియా పేసర్ స్థాయికి ఆయన ఎదిగాడు. నటరాజన్ సేలం సమీపంలోని చిన్నపంబట్టి అనే గ్రామానికి చెందినవాడు. నటరాజన్ కెరియర్ ప్రారంభంలో తన అమ్మగారు అదే గ్రామంలో కూరగాయలు అమ్ముతుండగా.. తండ్రి ఓ కూలీ. బస్సు ఎక్కేందుకు రూ.5 లేని పరిస్థితి నుంచి నేడు తమ కుటుంబాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడని ఓ సందర్భంలో తన అమ్మగారు సగర్వంగా చెప్పుకొచ్చారు. -
11 ఏళ్ల తర్వాత ధావన్..
సాక్షి, హైదరాబాద్ : విధ్వంసకర బ్యాట్స్‌మన్, టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఆరంభం నుంచి ఆడుతున్నాడు. ఈ క్యాష్ రిచ్‌లీగ్‌లో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఒంటి చేత్తో సైతం మ్యాచ్‌లను గెలిపించాడు. ఐతే కొన్నేళ్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ 2016 టైటిల్ నెగ్గడంలో అతని పాత్ర అమోఘం. ఇలా మంచి బ్యాటింగ్ రికార్డు ఉన్న ధావన్‌కు బ్యాట్స్‌మెన్, అభిమానులు ప్రతిష్టాత్మకంగా భావించే ఆరేంజ్ క్యాప్ సొంతం చేసుకోవడానికి మాత్రం 11 ఏళ్లు పట్టింది. లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికిచ్చే ఈ క్యాప్ ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ గబ్బర్ సొంతమైంది. ఈ సందర్భంగా ధావన్ ట్విటర్ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ‘ ఈ సీజన్లో రెండు మ్యాచ్‌లకు రెండు గెలవడం.. 11 ఏళ్లలో తొలి సారి ఆరేంజ్ క్యాప్ అందుకోవడంతో సంతోషంగా ఉన్నా. గత రాత్రి మ్యాచ్ అద్భుతం. ఈ ఊపు ఇలానే కోనసాగుతుందనకుంటున్నా’ అని ట్వీట్లో పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ధావన్ (45: 28 బంతుల్లో 8 ఫోర్ల)తో రాణించాడు. ఇక రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ధావన్ . (77 నాటౌట్: 57 బంతుల్లో 13ఫోర్లు, సిక్స్) అందివచ్చిన అవకాశంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. రెండు మ్యాచ్‌ల్లో కలిపి గబ్బర్ చేసిన పరుగులు 122. ఆటగాళ్ల వ్యక్తిగత జాబితాలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోరు కావడంతో ధావన్‌కు గురువారం మ్యాచ్ ముగిసిన అనంతరం ఆరెంజ్ క్యాప్ బహుకరించారు. 2 out of 2! What a game last night. The orange cap signifies that the team and you personally, both are going good in the IPL! First time in 11 years. Hope to keep the momentum going🏏🏏😃😃😉 pic.twitter.com/wEOyKFhSOj — Shikhar Dhawan (@SDhawan25) 13 April 2018 -
గంభీర్ సేనపై ప్రతీకారం తీర్చుకుంటారా!
కోల్ కతా: ఒక జట్టులో చూస్తే హిట్టర్లు..చెలరేగితే భారీ స్కోరు ఖాయం. మరో జట్టులో అత్యుత్తమ బౌలర్లు. ప్రత్యర్థి జట్టును కట్టడి చేయడంలో రికార్డు. ఈ రెండు జట్లు ఎలిమినేటర్ రౌండ్లో తలపడటానికి రంగం సిద్ధమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా బుధవారం రాత్రి గం.8.00లకు ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్ కతా నైట్ రైడర్స్‌తో సన్ రైజర్స్ హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనుంది. ప్లే ఆఫ్ దశలో జరిగే ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు ఇంటి ముఖం పట్టాల్సిందే. అయితే ఈ మ్యాచ్ లో కోల్ కతానే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. అంతకుముందు లీగ్ దశలో కోల్ కతా తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ సన్ రైజర్స్ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో కోల్ కతాపై సన్ రైజర్స్ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. మరో వైపు సన్ రైజర్స్పై 'హ్యాట్రిక్' విజయం సాధించి రెండో క్వాలిఫయర్‌కు అర్హత సాధించాలని కోల్ కతా యోచిస్తోంది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్-కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది. ఒకవైపు కోల్ కతా జట్టులో కెప్టెన్ గౌతం గంభీర్‌తో పాటు రాబిన్ ఉతప్ప, మున్రో, యూసఫ్ పఠాన్, మనీష్ పాండే వంటి స్టార్ ఆటగాళ్లుండగా, మరోవైపు డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, విలియమ్సన్ లతో సన్ రైజర్స్ పటిష్టంగా ఉంది. కాగా, లీగ్ దశలో చివరి నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట ఓటమి పాలుకావడం సన్ రైజర్స్ జట్టులో ఆందోళన పెంచుతుంది. దాదాపు కోల్ కతా పరిస్థితి కూడా ఇలానే ఉన్నా కాస్త మెరుగ్గా ఉంది. మరి కోల్ కతా హ్యాట్రిక్ సాధిస్తుందా?లేక సన్ రైజర్స్ ప్రతీకారం తీర్చుకుంటుందా?అనేది మాత్రం ఆసక్తికరమే. ఫిరోజ్ షా కోట్ల మైదానం బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉండటంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. రేపటి మ్యాచ్‌లో టాస్ కూడా కీలక పాత్ర పోషించనుంది.