శిఖర్ ధావన్ (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : విధ్వంసకర బ్యాట్స్‌మన్, టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఆరంభం నుంచి ఆడుతున్నాడు. ఈ క్యాష్ రిచ్‌లీగ్‌లో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఒంటి చేత్తో సైతం మ్యాచ్‌లను గెలిపించాడు. ఐతే కొన్నేళ్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ 2016 టైటిల్ నెగ్గడంలో అతని పాత్ర అమోఘం. ఇలా మంచి బ్యాటింగ్ రికార్డు ఉన్న ధావన్‌కు బ్యాట్స్‌మెన్, అభిమానులు ప్రతిష్టాత్మకంగా భావించే ఆరేంజ్ క్యాప్ సొంతం చేసుకోవడానికి మాత్రం 11 ఏళ్లు పట్టింది. లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికిచ్చే ఈ క్యాప్ ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ గబ్బర్ సొంతమైంది. ఈ సందర్భంగా ధావన్ ట్విటర్ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ‘ ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లకు రెండు గెలవడం.. 11 ఏళ్లలో తొలి సారి ఆరేంజ్ క్యాప్ అందుకోవడంతో సంతోషంగా ఉన్నా. గత రాత్రి మ్యాచ్ అద్భుతం. ఈ ఊపు ఇలానే కోనసాగుతుందనకుంటున్నా’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు.
ముంబై ఇండియన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ధావన్ (45: 28 బంతుల్లో 8 ఫోర్ల)తో రాణించాడు. ఇక రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ధావన్ . (77 నాటౌట్: 57 బంతుల్లో 13ఫోర్లు, సిక్స్) అందివచ్చిన అవకాశంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. రెండు మ్యాచ్‌ల్లో కలిపి గబ్బర్ చేసిన పరుగులు 122. ఆటగాళ్ల వ్యక్తిగత జాబితాలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోరు కావడంతో ధావన్‌కు గురువారం మ్యాచ్ ముగిసిన అనంతరం ఆరెంజ్ క్యాప్ బహుకరించారు.
2 out of 2! What a game last night. The orange cap signifies that the team and you personally, both are going good in the IPL! First time in 11 years. Hope to keep the momentum going🏏🏏😃😃😉 pic.twitter.com/wEOyKFhSOj
— Shikhar Dhawan (@SDhawan25) 13 April 2018
Comments
Please login to add a commentAdd a comment