
ఐపీఎల్-2022 సమరానికి సమయం దగ్గరపడతుండంతో ఆయా జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలో సన్‌రైజెర్స్ హైదరాబాద్ స్టార్ బౌలర్ టి నటరాజన్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే నటరాజన్ తన ప్రాక్టీస్‌లో భాగంగా అద్భుతమైన బంతితో ఏకంగా వికెట్‌ను విరగొట్టాడు.
దీనికి సంబంధించిన వీడియోను ఎస్‌ఆర్‌హెచ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక గాయం కారణంగా గతేడాది ఐపీఎల్‌లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే నటరాజన్ ఆడాడు. అయితే ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్ సాధించి ఈ ఏడాది సీజన్‌లో సత్తా చాటడానికి నటరాజన్ సిద్దమయ్యాడు.
మరోవైపు ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ నేతృత్వంలో నటరాజన్ మరింత రాటుదేలుతున్నాడు. ఐపీఎల్ మెగా వేలానికి ముందు నటరాజన్‌ను రూ.4 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్ రీటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక మార్చి 26 నుంచి ఐపీఎల్ మహా సంగ్రామానికి తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో కోలకతా నైట్‌రైడెర్స్ తలపడనుంది.
చదవండి: IPL 2022: చెన్నై అభిమానులకు గుడ్ న్యూస్.. స్టార్ ఓపెనర్ వచ్చేశాడు!