![Umran Malik Names His Bowling Idols - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2022/06/6/Umran_0.jpg.webp?itok=T4rLhtUp)
ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన ఉమ్రాన్ 22 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసిన మాలిక్.. ఏకంగా భారత జట్టులో చోటు కొట్టేశాడు. ఢిల్లీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న తొలి టీ20లో మాలిక్ భారత తరపున అరేంగట్రం చేయనున్నాడు. కాగా ఐపీఎల్‌లో దుమ్ము రేపిన ఈ స్పీడ్ స్టార్‌పై ఇప్పటికీ ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా ఇటీవల ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉమ్రాన్ మాలిక్‌ను ఆసీస్ మాజీ బౌలర్ బ్రెట్ లీ ప్రశంసించాడు.
ఉమ్రాన్ పేస్ చూస్తుంటే పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వకార్ యూనిస్ గుర్తుకొస్తున్నాడంటూ చెప్పాడు. అయితే తాజగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉమ్రాన్ మాలిక్‌ను ఇదే విషయం ప్రశ్నించగా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఎప్పడూ వకార్ యూనిస్‌ను అనుసరించలేదని, భారత పేస్ దిగ్గజాలు జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ షమీ,భువనేశ్వర్ కుమార్‌ను ఆదర్శంగా తీసుకున్నాని మాలిక్ తెలిపాడు.
"నేను వకార్ యూనిస్ బౌలింగ్‌ను ఎప్పడూ ఫాలో కాలేదు. నాకంటూ ఓ బౌలింగ్ స్టైల్ ఉంది. టీమిండియా స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ భాయ్ నేను క్రికెట్‌లో ఎక్కువగా ఆరాదించే బౌలర్లు. నా కెరీర్ ఆరంభం నుంచే ఈ ముగ్గరి దిగ్గజాలని అనుసరిస్తూ ఉన్నాను. దేశం తరపున ఆడటం నాకు గర్వంగా ఉంది. నా దేశం కోసం నా వంతు కృషి చేయాలనుకుంటున్నాను. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో నాకు అవకాశం లభించింది. ఈ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఒంటి చేత్తో గెలిపించి భారత్‌కు అందించడమే నా లక్ష్యం" అని ఉమ్రాన్ మాలిక్ పేర్కొన్నాడు.
చదవండి: IND Vs SA T20: టీమిండియాతో టీ20 సిరీస్.. దక్షిణాఫ్రికా నెట్ బౌలర్‌గా ఢిల్లీ యువ ఆటగాడు..!
Comments
Please login to add a commentAdd a comment