Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ది బ్యాటర్లకు ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో ప్రతీ మ్యాచ్‌లో గంటకు 150 కి.మీ పైగా స్పీడ్‌తో మాలిక్ బౌలింగ్ చేస్తున్నాడు. అంతేకాకుండా ఈ సీజన్‌లో ఫాస్టెస్ట్ డెలివరీ (157 కెఎమ్‌పిహెచ్) వేసిన రికార్డు కూడా మాలిక్ పేరిటే ఉంది. తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తన వేసిన ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డును మాలిక్ బద్దలు కొడితే చూడాలన్న తన కోరికను అక్తర్ వ్యక్తం చేశాడు.
కాగా ప్రపంచ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన డెలివరీ వేసిన రికార్డు అక్తర్ పేరున ఉంది. 2003 ప్రపంచకప్‌లో అక్తర్ గంటకు 161.3 కి.మీ వేగంతో వేశాడు." మాలిక్ చాలా కాలం పాటు క్రికెట్ ఆడాలని నేను కోరుకుంటున్నాను. నేను అంతర్జాతీయ క్రికెట్‌లో వేగవంతమైన డెలివరీ చేసి 20 సంవత్సరాలైంది, కానీ ఎవరూ నా రికార్డును బద్దలు కొట్టలేకపోయారు. అయితే నా రికార్డును ఎవరైనా బద్దలు కొడితే చూడాలని ఉంది. ఒక వేళ ఉమ్రాన్ నా రికార్డును బ్రేక్ చేస్తే సంతోషిస్తాను.
కానీ అతను ప్రక్రియలో గాయపడకుండా చూసుకోవాలి. అతడు ఎటువంటి గాయాల బారిన పడకుండా తన కెరీర్‌ను కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. అదే విధంగా అంతర్జాతీయ మ్యాచ్‌లలో అతడిని నేను చూడాలనుకుంటున్నాను. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే బౌలర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఉమ్రాన్ మాత్రం ఆ వేగంతో నిలకడగా బౌలింగ్ చేయడం చూశాం" అని అక్తర్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022 RR Vs CSK: రాజస్థాన్ అభిమానులకు గుడ్ న్యూస్.. విధ్వంసకర ఆటగాడు వచ్చేశాడు
Comments
Please login to add a commentAdd a comment