PC: IPL.com
సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్-2022లో అద్భుతంగా రాణించాడు. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన ఉమ్రాన్.. ఏకంగా భారత జట్టలో చోటు దక్కించుకున్నాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్‌కు ఉమ్రాన్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది సీజన్‌లో ఉమ్రాన్ మాలిక్ ఎంత సంపాందించాడో ఓసారి గమనిద్దాం. ఈ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన ప్రతి మ్యాచ్ లో ఫాస్టెస్ట్ డెలివరీ అవార్డు మాలిక్ దే. ఈ అవార్డుల ద్వారా మాలిక్ రూ. 14 లక్షలు సంపాదించాడు.
అదే విధంగా పంజాబ్ కింగ్స్,గుజరాత్ టైటాన్స్‌పై అత్యుత్తమ ప్రదర్శన చేసిన మాలిక్‌కు రెండుసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’అవార్డు కూడా లభించింది. ఈ రెండు అవార్డుల ద్వారా అతడు రూ. 2లక్షలు సంపాదించాడు. ఇవే గాక గుజరాత్, పంజాబ్ తో మ్యాచ్ లలో ప్రదర్శనకు గాను గేమ్ ఛేంజర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ల ద్వారా మరో రెండు లక్షలు పొందాడు.
పంజాబ్ తో మ్యాచ్ లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ఉమ్రాన్‌కే దక్కింది. దీనికి ఓ లక్ష. మొత్తంగా రూ. 3 లక్షలు ఉమ్రానక్‌కు దక్కాయి. అదే విధంగా అతడికి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు కూడా దక్కింది. ఈ అవార్డు రూపంల మరో రూ.10 లక్షలు దక్కాయి. కాగా ఈ ఏడాది సీజన్‌లో మొత్తం అవార్డుల రూపంలో ఉమ్రాన్ మాలిక్ రూ. 29 లక్షలు సంపాదించాడు.
చదవండి: IPL 2022 Final Prize Money, Awards: ఐపీఎల్ ‘విజేతలు’.. ఎవరెవరి ప్రైజ్‌మనీ ఎంతంటే!
Comments
Please login to add a commentAdd a comment