
హార్భజన్ సింగ్
ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా రాణిస్తున్నాడు. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. మాలిక్ తన అద్భుత ప్రదర్శనతో అందరినీ అకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో ఉమ్రాన్ మాలిక్‌ను వీలైనంత త్వరగా భారత జట్టుకు ఎంపికచేయాలని మాజీలు, క్రికెట్ నిపుణులు కోరుకుంటున్నారు. ఈ కోవలో బారత మాజీ క్రికెటర్ హార్భజన్ సింగ్ చేరాడు. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ 20 ప్రపంచకప్‌కు ఉమ్రాన్ మాలిక్‌ను భారత జట్టుకు ఎంపిక చేయాలని హార్భజన్ సింగ్ ఆకాక్షించాడు.
"ఉమ్రాన్ మాలిక్ నా ఫేవరేట్ బౌలర్. నేను అతడిని భారత జట్టులో చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే అద్భుతమైన పేస్ బౌలర్. అతడు 150 కి.మీ కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. అంత స్పీడ్‌తో బౌలింగ్ చేసే ఏ బౌలర్ కూడా జాతీయ జట్టుకు ఆడకుండా లేడు. అతడు తన ప్రదర్శనతో చాలా మంది యువ ఆటగాళ్లకు ఆదర్శవంతంగా నిలుస్తున్నాడు. కాగా అతడు టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక అవుతాడో లేదో నాకు తెలియదు. కానీ నేను సెలక్షన్ కమిటీలో భాగమైతే, ఖచ్చితంగా అతడిని ఎంపిక చేస్తాను. టి20 ప్రపంచకప్‌లో జస్ప్రీత్ బుమ్రాకు మాలిక్ సరైన జోడి' అని హార్భజన్ సింగ్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022: 'కోల్‌కతా మ్యాచ్‌లో విలన్.. ఇప్పుడు హీరో.. శభాష్ సామ్స్'