Yuzvendra Chahal Disappointed Umran Malik Said Hit 3 Sixes By Bowling - Sakshi
Sakshi News home page

Chahal-Umran Malik: 'మాట తప్పాడు.. చాలా బ్యాడ్‌గా అనిపిస్తోంది'

Published Wed, Apr 5 2023 5:41 PM | Last Updated on Wed, Apr 5 2023 6:13 PM

Yuzvendra Chahal Disappointed-Umran Malik Said Hit-3-Sixes My Bowling - Sakshi

Photo:: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా శనివారం రాజస్తాన్‌ రాయల్స్‌తో హోంగ్రౌండ్‌లో మ్యాచ్‌ ఆడిన ఎస్‌ఆర్‌హెచ్‌ దారుణ పరాజయాన్ని చవిచూసింది. 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ 72 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. రాజస్తాన్‌ బౌలర్‌ చహల్‌ నాలుగు వికెట్లతో ఎస్‌ఆర్‌హెచ్‌ పతనాన్ని శాసించాడు.

ఇక బుధవారం రాజస్తాన్‌ పంజాబ్‌ కింగ్స్‌తో తర్వతి మ్యాచ్‌ ఆడనుంది. కాగా పంజాబ్‌కు వెళ్లే సమయంలో విమానంలో చహల్‌ను రాజస్తాన్‌ ప్రెజంటేటర్‌ ఫన్నీ ఇంటర్య్వూ చేశాడు. చహల్‌.. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీశావు.. ఉమ్రాన్‌ బాయ్‌ ఢిపెన్స్‌ చేయకపోయుంటే నీకు ఐదో వికెట్‌ లభించేది.. ఇప్పుడు నువ్వు ఉమ్రాన్‌కు ఏం చెప్పాలనుకుంటున్నావ్‌ అని అడిగాడు.

''చెప్పడానికి ఏం లేదు.. నేను ఉమ్రాన్‌ను కలిసినప్పుడు నాకు బాగా గుర్తు అతను నా బౌలింగ్‌లో మూడు సిక్సర్లు కొడుతా అని చెప్పాడు.. కానీ ఉమ్రాన్‌ మాట తప్పాడు.. ఇది చాలా బ్యాడ్‌గా అనిపించింది. అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రాజస్తాన్‌తో మ్యాచ్‌లో గంటకు 145 కిమీ వేగంతో బంతులేసిన ఉమ్రాన్‌ మాలిక్‌.. దేవదత్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేసిన బంతి మాత్రం 150 కిమీ స్పీడుతో వచ్చినట్లు తెలుస్తోంది.

చదవండి: చరిత్రలో ఇదే తొలిసారి.. పురుషుల క్రికెట్‌లో కొత్త శకం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement