
Courtesy: IPL Twitter
ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ తన చెత్త ఫామ్‌ను ఐపీఎల్ 2022లోనూ కంటిన్యూ చేశాడు. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్ ద్వారా ఫించ్ కేకేఆర్ తరపున ఈ సీజన్‌లో ఎంట్రీ ఇచ్చాడు. భువనేశ్వర్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన ఫించ్ మంచి టచ్‌లో కనిపించాడు. అయితే తర్వాతి ఓవర్లోనే వెనుదిరిగి ఒక్క సిక్స్‌కే పరిమితమై పెవిలియన్ చేరాడు. మార్కో జాన్సెన్ వేసిన ఇన్నింగ్స్ 2వ ఓవర్లో ఆఫ్‌స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని ఫ్రంట్‌ఫుట్ వచ్చి మరీ షాట్ కొట్టే క్రమంలో కీపర్ పూరన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఇక 2010 నుంచి ఐపీఎల్ ఆడుతున్న ఫించ్ ప్రతీ సీజన్ తొలి మ్యాచ్‌లో పెద్దగా రాణించలేకపోయాడు. 2010 నుంచి 2022 వరకు చూసుకుంటే ఫించ్ వరుసగా 21,8,64,2,58,74,0,29,7 పరుగులు సాధించాడు. మూడుసార్లు అర్థసెంచరీలు మినహా గోల్డెన్ డక్ సహా మూడుసార్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమ్యాడు. ఇటీవలే పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఘోరంగా విఫలమైన ఫించ్ రెండు సార్లు డకౌట్ అయ్యాడు. ఈ రెండుసార్లు పాకిస్తాన్ పేసర్ షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. తాజాగా అదే చెత్త ఫామ్‌ను ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌లోనూ కంటిన్యూ చేశాడు. ఫించ్ ఔట్‌పై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. ''భలే ఎంట్రీ ఇచ్చావ్ ఫించ్''.. ''నీ ఆటలో ఏ మార్పు లేదు..'' అంటూ కామెంట్ చేశారు.
ఆరోన్ ఫించ్ ఔట్ చేయడం కోసం క్లిక్ చేయండి
చదవండి: SuryaKumar Yadav: 'సలహాలు అవసరం లేదు.. ఆ స్థాయిని ఎప్పుడో దాటేశారు'
Comments
Please login to add a commentAdd a comment