గెలాక్సీ నోట్ 8 లాంచింగ్..
గెలాక్సీ నోట్ 8 లాంచింగ్..
Published Wed, Aug 23 2017 1:12 PM | Last Updated on Sun, Sep 17 2017 5:53 PM
న్యూఢిల్లీ : గెలాక్సీ నోట్ 7 ఫెయిల్యూర్‌తో తర్వాత, దాని తర్వాత స్మార్ట్‌ఫోన్‌గా శాంసంగ్ తీసుకురాబోతున్న గెలాక్సీ నోట్ 8 నేడే విడుదల కాబోతుంది. న్యూయార్క్ వేదికగా స్పెషల్ ఈవెంట్‌లో ఈ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేయబోతుంది. ఈ గెలాక్సీని అన్ని అంశాల పరంగా ఎక్కువ శక్తివతంగా, మెరుగ్గా కంపెనీ తీర్చిదిద్దింది. ఇప్పటికే ఈ ఫోన్‌పై పలు లీకేజీలు, రూమర్లు మార్కెట్‌లో చక్కర్లు కొట్టాయి. కొన్ని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లే ధృవీకరించారు. ఈ గెలాక్సీ 8 ధర గెలాక్సీ నోట్ 7 కంటే ఎక్కువ ఉండొచ్చని తెలుస్తోంది. వెంచర్ బీట్ రిపోర్టు ప్రకారం ఈ డివైజ్ సుమారు 1000 డాలర్లు అంటే సమారు రూ.64వేల మధ్యలో ఉండొచ్చని టాక్. మార్కెట్లు, వేరియంట్ల బట్టి ధరల్లో మార్పులు కూడా చోటుచేసుకోనున్నాయి. నేడు లాంచ్ అయ్యే ఈ ఫోన్ సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్‌లో భారత మార్కెట్‌లోకి రానుంది. శాంసంగ్‌కు భారత్ అదిపెద్ద మార్కెట్లలో ఒకటి. శాంసంగ్ గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ డివైజ్‌లకు ఉన్నమాదిరే ఈ ఫోన్ వెనుకవైపు మెటల్ గ్లాస్‌తో రూపొందుతుంది.
అంచనాల ప్రకారం గెలాక్సీ నోట్ 8 మిగతా ఫీచర్లు...
6.3 అంగుళాల క్యూహెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్
కొన్ని మార్కెట్లలో ఎక్సీనోస్ ప్రాసెసర్ వేరియంట్లు కూడా
12మెగాపిక్సెల్ సెన్సార్లతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
4జీబీ ర్యామ్ లేదా 6జీబీ ర్యామ్
64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్
256జీబీ వరకు విస్తరణ
3300ఎంఏహెచ్ బ్యాటరీ
Advertisement
Advertisement