శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 8 పై రూ. 32వేలు తగ్గింపు | Samsung Galaxy Note 8 available with Rs 32 910 Discount | Sakshi
Sakshi News home page

శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 8 పై రూ. 32వేలు తగ్గింపు

Published Fri, Aug 9 2019 4:52 PM | Last Updated on Fri, Aug 9 2019 8:36 PM

Samsung Galaxy Note 8 available with Rs 32 910 Discount  - Sakshi

సాక్షి, ముంబై : ఫ్లిప్‌కార్ట్‌ శాంసంగ్‌ గెలాక్స్‌ నెట్‌ 8 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఫ్లిప్‌కార్ట్  నిర్వహిస్తున్న 'నేషనల్ షాపింగ్ డేస్ సేల్' లో  శాంసంగ్‌ గెలాక్స్‌  నోట్‌ 8 ను రూ. 34,990లకే అందిస్తోంది.  2017లో లాంచ్‌ అయిన గెలాక్సీ నోట్ 8పై రూ.32,910 ల ప్రత్యేక తగ్గింపును అందిస్తోందన్నమాట.  ఈ  సేల్‌  రేపు(శనివారం) ముగియనున్న సంగతి తెలిసిందే.

దీంతో పాటు మరికొన్ని స్మార్ట్‌ఫోన్లపై కూడా  డిస్కౌంట్లను అందిస్తోంది. దీంతోపాటు ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ ,  క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు అదనంగా 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. నిబంధనలకు లోబడి పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్పిడి  సమయంలో రూ .17,900 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు.

గెలాక్సీ నోట్ 8 ఫీచర్ల విషయానికి వస్తే  6.3  ఇంచెస్‌ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే,1440x2960 ​​పిక్సెల్స్ రిజల్యూషన్‌, ఐపి 68 సర్టిఫికేషన్‌, డబుల్‌ రియర్‌ కెమెరా, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ మెయిన్‌ ఫీచర్లుగా ఉన్నాయి.  6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ గెలాక్సీ నోట్ 8 ను సెప్టెంబర్,  2017 లో రూ .67,900  ధర వద్ద లాంచ్ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement