సాక్షి, న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్ 8 ధరను కంపెనీ తగ్గించింది. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.3000 మేర ధరను తగ్గిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.67,900 కాగ, ధర తగ్గింపు అనంతరం గెలాక్సీ నోట్ 8 రూ.64,900కు అందుబాటులోకి వచ్చింది. భారత్‌లో ఇప్పటి వరకు శాంసంగ్ లాంచ్ చేసిన అన్ని ఫోన్లలో గెలాక్సీ నోట్ 8 మాత్రమే అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్. ఎక్స్‌క్లూజివ్‌గా ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ఇండియాలో మాత్రమే అందుబాటులో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసిన కస్టమర్లకు అమెజాన్ 4000 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఆఫర్ చేస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 ఫీచర్లు..
6.3 అంగుళాల క్వాడ్ హెచ్‌డీప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్‌ఫినిటీ డిస్‌ప్లే
ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ 835 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ ఆపరేటింగ్ సిస్టమ్
6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్
12 ఎంపీ సెన్సార్లతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
8ఎంపీ ఫ్రంట్ కెమెరా
3,300 ఎంఏహెచ్ బ్యాటరీ
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేసియల్ రికగ్నైజేషన్, ఐరిష్ స్కానర్
శాంసంగ్ పే సపోర్టు
కంపెనీ సొంత డిజిటల్ అసిస్టెంట్ బిక్స్బీ
Comments
Please login to add a commentAdd a comment