పాపులర్ శాంసంగ్ డివైజ్‌లపై అమెజాన్ ఇండియా క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. మార్చి 5 నుంచి ప్రారంభమైన శాంసంగ్ కార్నివల్ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై 8వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్టు అమెజాన్ తెలిపింది. అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో ఈ క్యాష్‌బ్యాక్‌ను అందించనుంది. గెలాక్సీ ఏ సిరీస్, గెలాక్సీ ఆన్ సిరీస్, గెలాక్సీ నోట్ సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తించనుంది. స్మార్ట్‌ఫోన్లపై మాత్రమే కాకుండా.. ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌లు టెలివిజన్లు, హోమ్ అప్లియెన్స్, టాబ్లెట్లు, వేరియబుల్స్, స్టోరేజ్ గాడ్జెట్లను కూడా శాంసంగ్ డిస్కౌంట్లలో అందుబాటులో ఉంచింది.
అమెజాన్ ఎక్స్‌క్లూజివ్ స్మార్ట్‌ఫోన్లు- శాంసంగ్ గెలాక్సీ ఏ8ప్లస్‌పై 4వేల రూపాయల అమెజాన్ పే క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఈ క్యాష్‌బ్యాక్ అనంతరం దీని ధర 28,990 రూపాయలకు దిగొచ్చింది. గెలాక్సీ ఆన్7 ప్రైమ్(32జీబీ) స్మార్ట్‌ఫోన్ ధర కూడా రెండు వేల రూపాయల క్యాష్‌బ్యాక్ అనంతరం 10,990 రూపాయలుగా ఉంది.
గెలాక్సీ ఆన్7 ప్రైమ్ 64జీబీ వేరియంట్ అమెజాన్ ఇండియాలో 12,990 రూపాయలకు అందుబాటులోకి వచ్చింది. గెలాక్సీ నోట్ 8పై అమెజాన్ పే క్యాష్‌బ్యాక్ 8వేల రూపాయలను అందిస్తోంది. దీంతో దీని ధర కూడా 59,900 రూపాయలకు దిగొచ్చింది. అదనంగా గెలాక్సీ ఆన్5 ప్రొ, గెలాక్సీ ఆన్7 ప్రొలపై కూడా డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
గెలాక్సీ జే7 ప్రైమ్, గెలాక్సీ జే7 ప్రొ, గెలాక్సీ జే5 ప్రైమ్‌తో పాటు పలు శాంసంగ్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుపై ఎక్స్చేంజ్ ఆఫర్ కింద 1,500 రూపాయల వరకు అదనపు డిస్కౌంట్‌ను అమెజాన్ అందిస్తోంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలపై అమెజాన్ 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తోంది. అయితే అది స్మార్ట్‌ఫోన్లు, వేరియబుల్స్, టాబ్లెట్లకు వర్తించడం లేదు. కేవలం టెలివిజన్లు, హోమ్ అప్లియెన్స్, ఫర్నీచర్, ల్యాప్‌టాప్‌లకు మాత్రమే అందిస్తోంది. పేటీఎం మాల్ కూడా శాంసంగ్ ఫోన్లపై 10వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment