Samsung smartphones
-
ఆఫర్ పట్టు.. జెర్సీ కొట్టు
సాక్షి, ముంబై : స్మార్ట్ఫోన్ల దిగ్గజం శాంసంగ్ ఐపీఎల్-11 సీజన్ సందర్భంగా శాంసంగ్ 20 - 20 కార్నివల్‌ను ప్రకటించింది. ఈ కార్నివల్లో భాగంగా ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లపై ప్రత్యేక ధరలను, ఎక్స్చేంజ్ ఆఫర్లను అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది. ఈ కార్నివల్‌ను శాంసంగ్ ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో నిర్వహిస్తోంది. శాంసంగ్ కార్నివల్ నేటి(ఏప్రిల్ 18) నుంచి ఏప్రిల్ 21 వరకు జరగనుంది. కేవలం డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు మాత్రమే కాక ప్రతిరోజు 20 మంది లక్కీ విన్నర్స్కి శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు ముంబై ఇండియన్స్ జెర్సీని కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. శాంసంగ్ 20 - 20 కార్నివల్లో అందిస్తున్న డిస్కౌంట్లు ఈ విధంగా ఉన్నాయి.. గెలాక్సీ ఏ8 ప్లస్ రూ.29,990కు అందుబాటులో ఉంది. 2వేల రూపాయల డిస్కౌంట్ ప్రకటించిన తర్వాత గెలాక్సీ ఆన్7 ప్రైమ్ 32 జీబీ వేరియంట్ రూ.10,990కే విక్రయానికి లభ్యమవుతోంది. అలానే గెలాక్సీ ఆన్7 ప్రైమ్ 64జీబీ వేరియంట్‌పై కూడా 2వేల రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.12,990కి తగ్గింది. పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకుని గెలాక్సీ ఆన్7 ప్రైమ్ కొనేవారికి అదనంగా మరో వెయ్యి రూపాయల డిస్కౌంట్ లభించనుంది. వీటితో పాటు శాంసంగ్ గెలాక్సీ ఆన్7 ప్రో, ఆన్5 ప్రో స్మార్ట్ఫోన్లు కూడా ప్రత్యేక ధరలు రూ.6,990కు, రూ. 6,490కు లభిస్తున్నాయి. ముంబై ఇండియన్స్‌కి ప్రధాన స్పాన్సర్ అయిన శాంసంగ్ ఈ ఐపీఎల్ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రియులకు ఆనందాన్ని పంచడానికి అమెజాన్‌లో ఈ కార్నివల్‌ను నిర్వహిస్తున్నట్లు శాంసంగ్ ఇండియా సీనియర్ డైరెక్టర్ సందీప్ సింగ్ అరోరా తెలిపారు. అమెజాన్ ఇండియా డైరెక్టర్ నూర్ పటేల్ మాట్లాడుతూ... అమెజాన్‌లో నిర్వహిస్తున్న శాంసంగ్ కార్నివల్ దేశవ్యాప్తంగా ఉన్న అమెజాన్ వినియోగదారులకు పునరుత్తేజాన్ని కలిగించనుందని తెలిపారు. ఈ క్రికెట్ సీజన్లో వినియోగదారులు కేవలం శాంసంగ్ స్మార్టఫోన్లపై ఆఫర్లను, డిస్కౌంట్లను మాత్రమే కాక వారి అభిమాన ముంబై ఇండియన్స్ జట్టు అధికారిక జెర్సీని కూడా పొందే అవకాశం ఉందన్నారు. ఈ కార్నివల్లో కొనుగోలుదారులకు డిస్కౌంట్ ఆఫర్లు మాత్రమే కాక మరిన్ని ప్రత్యేక ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన ఫోన్లపై ఎంపిక చేసిన క్రెడిట్ / డెబిట్ కార్డులపై నో కాస్ట్ ఈఎమ్ఐ ఆఫర్‌ను కూడా శాంసంగ్ ప్రకటించింది. -
గెలాక్సీ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు
దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ శాంసంగ్ కార్నివల్ సేల్‌ను ప్రారంభించింది. శాంసంగ్ ఉత్పత్తులు స్మార్ట్ఫోన్లు, ఎల్ఈడీ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, మైక్రోవేవ్, ఓవెన్లపై భారీ డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. నిన్నటి నుంచి ప్రారంభమైన ఈ సేల్, రేపటి వరకు జరుగనుంది. గెలాక్సీ స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు... గెలాక్సీ ఆన్ మ్యాక్స్ 4జీబీ ర్యామ్/32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,900 నుంచి రూ.12,900కు తగ్గింపు గెలాక్సీ ఆన్5 స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,990 నుంచి రూ.5,990కు తగ్గింది గెలాక్సీ ఆన్ నెక్ట్స్ స్మార్ట్‌ఫోన్ 3జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.9,499కే అందుబాటు గెలాక్సీ జే3 ప్రొ 2జీబీ/16జీబీ వేరియంట్ రూ.6,990కే విక్రయం, ఈ ఫోన్ అసలు ధర రూ.8,490. గెలాక్సీ జే7 ఎడ్జ్ 4జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.34,990కు కొనుగోలు చేసుకోవచ్చు గెలాక్సీ జే7 ప్రొ ధర రూ.18,900 నుంచి ప్రారంభం గెలాక్సీ జే7 రూ.13,800కు అందుబాటు స్మార్ట్ఫోన్లతోనే కాకుండా.. శాంసంగ్ ఇతర ప్రొడక్ట్‌లపై కూడా డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. శాంసంగ్ 32 అంగుళాల హెడ్డీ రెడీ ఎల్ఈడీ టీవీ ఈ సేల్‌లో రూ.17,499కే అందుబాటులోకి వచ్చింది. శాంసంగ్ ఫులీ ఆటోమేటిక్ 6.5 కేజీల వాషింగ్ మిషన్ ధర ఎక్స్చేంజ్లో రూ.2500 వరకు తగ్గి, రూ.15,999కి విక్రయానికి వచ్చింది. రూ.13,972 నుంచి శాంసంగ్ రూమ్ ఎయిర్ ప్యూరిఫైర్స్ ధర ప్రారంభమైంది. మైక్రోవేవ్స్ రూ.5,999కు అందుబాటులో వచ్చాయి. వీటిపై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. అంతేకాకుండా ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఇస్తోంది. ఈ తగ్గింపునకు గాను కనీసం కొనుగోలు విలువ రూ.5,990 ఉండాలన్న షరతు విధించింది. -
ఆ పాపులర్ స్మార్ట్ఫోన్లపై 8వేల క్యాష్‌బ్యాక్
పాపులర్ శాంసంగ్ డివైజ్‌లపై అమెజాన్ ఇండియా క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. మార్చి 5 నుంచి ప్రారంభమైన శాంసంగ్ కార్నివల్ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన శాంసంగ్ స్మార్ట్ఫోన్లపై 8వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్టు అమెజాన్ తెలిపింది. అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో ఈ క్యాష్‌బ్యాక్‌ను అందించనుంది. గెలాక్సీ ఏ సిరీస్, గెలాక్సీ ఆన్ సిరీస్, గెలాక్సీ నోట్ సిరీస్ స్మార్ట్ఫోన్లపై ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తించనుంది. స్మార్ట్ఫోన్లపై మాత్రమే కాకుండా.. ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌లు టెలివిజన్లు, హోమ్ అప్లియెన్స్, టాబ్లెట్లు, వేరియబుల్స్, స్టోరేజ్ గాడ్జెట్లను కూడా శాంసంగ్ డిస్కౌంట్లలో అందుబాటులో ఉంచింది. అమెజాన్ ఎక్స్‌క్లూజివ్ స్మార్ట్ఫోన్లు- శాంసంగ్ గెలాక్సీ ఏ8ప్లస్‌పై 4వేల రూపాయల అమెజాన్ పే క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఈ క్యాష్‌బ్యాక్ అనంతరం దీని ధర 28,990 రూపాయలకు దిగొచ్చింది. గెలాక్సీ ఆన్7 ప్రైమ్(32జీబీ) స్మార్ట్‌ఫోన్ ధర కూడా రెండు వేల రూపాయల క్యాష్‌బ్యాక్ అనంతరం 10,990 రూపాయలుగా ఉంది. గెలాక్సీ ఆన్7 ప్రైమ్ 64జీబీ వేరియంట్ అమెజాన్ ఇండియాలో 12,990 రూపాయలకు అందుబాటులోకి వచ్చింది. గెలాక్సీ నోట్ 8పై అమెజాన్ పే క్యాష్‌బ్యాక్ 8వేల రూపాయలను అందిస్తోంది. దీంతో దీని ధర కూడా 59,900 రూపాయలకు దిగొచ్చింది. అదనంగా గెలాక్సీ ఆన్5 ప్రొ, గెలాక్సీ ఆన్7 ప్రొలపై కూడా డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. గెలాక్సీ జే7 ప్రైమ్, గెలాక్సీ జే7 ప్రొ, గెలాక్సీ జే5 ప్రైమ్‌తో పాటు పలు శాంసంగ్ మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ల కొనుగోలుపై ఎక్స్చేంజ్ ఆఫర్ కింద 1,500 రూపాయల వరకు అదనపు డిస్కౌంట్‌ను అమెజాన్ అందిస్తోంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలపై అమెజాన్ 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తోంది. అయితే అది స్మార్ట్ఫోన్లు, వేరియబుల్స్, టాబ్లెట్లకు వర్తించడం లేదు. కేవలం టెలివిజన్లు, హోమ్ అప్లియెన్స్, ఫర్నీచర్, ల్యాప్‌టాప్‌లకు మాత్రమే అందిస్తోంది. పేటీఎం మాల్ కూడా శాంసంగ్ ఫోన్లపై 10వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది. -
ఆ ఫోన్లను విక్రయిస్తున్న మైక్రోసాఫ్ట్
న్యూఢిల్లీ : మైక్రోసాఫ్ట్ ఇటీవలే తన విండోస్ ఫోన్లు విక్రయించడాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక నుంచి ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లపై ఎక్కువగా దృష్టిసారించనున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ తన కంపెనీ స్టోర్లలో ఆండ్రాయిడ్ డివైజ్‌లను విక్రయించడం ప్రారంభించింది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 8ను మైక్రోసాఫ్ట్ విక్రయించడం ప్రారంభించిందని తెలిసింది. గెలాక్సీ నోట్ 8 మైక్రోసాఫ్ట్ స్టోర్‌లోకి వచ్చిన తర్వాత రేజర్ ఫోన్‌ను, శాంసంగ్ గెలాక్సీ ఎస్8ను, గెలాక్సీ ఎస్8 ప్లస్‌ను విక్రయించడం ప్రారంభించిందని రిపోర్టులు పేర్కొన్నాయి. ఎస్8ను 725 డాలర్లకు, ఈ డివైజ్‌లో అతిపెద్ద దాన్ని 825 డాలర్లకు విక్రయిస్తున్నట్టు తెలిసింది. శాంసంగ్ వెబ్సైట్లో కూడా ఇవే ధరలున్నాయి. మైక్రోసాఫ్ట్ బ్లాక్ ఫ్రైడే డీల్స్ సందర్భంగా గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ స్మార్ట్ఫోన్లపై బిగ్ డిస్కౌంట్‌ను కూడా ప్రకటించింది. 150 డాలర్ల తగ్గింపుతో ఈ డివైజ్‌లను అందుబాటులో ఉంచింది. అదనంగా ఏటీ అండ్ టీ, వెరిజోన్ వేరియంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. -
ఉపాధి సిబ్బందితో సెల్‌గాటం
గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ శాంసంగ్ మొబైల్ ఫోన్ల వ్యాపారం ప్రారంభించిందా? ఉపాధి హామీ పథకం సిబ్బంది వద్దంటున్నా బలవంతంగా పాత స్మార్ట్ఫోన్లను అంటగట్టే ప్రయత్నాలు ప్రారంభిం చిందా? స్మార్టు ఫోన్లు ఉన్నా మళ్లీ కొనాల్సి వస్తోందని ఉపాధి హామీ పథకం సిబ్బంది వాపోతున్నారా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఉపాధి పథకం సిబ్బంది వద్ద ఇప్పటికే స్మార్టు ఫోన్లు ఉన్నా అంతగా ఫీచర్లు లేని ఫోన్లను బలవంతంగా అంటగట్టడం ఇందుకు నిదర్శనం. సాక్షి, మచిలీప్నటం: రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభించి పదేళ్లు పూర్తయింది. పథకంలో పారదర్శకత కోసం 8 ఏళ్లుగా కూలీల హాజరు, పని కొలతల నమోదు, కూలి చెల్లింపును ఆన్లైన్లో చేపడుతున్నారు. ఇందు కోసం క్షేత్ర స్థాయి సిబ్బంది మొదలు కార్యాలయ సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ అధునాతన టెక్నాలజీతో కూడిన ఆండ్రాయిడ్ స్మార్టు ఫోన్లను వినియోగిస్తున్నారు. 2006లో పథకం ప్రారంభం సమయంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ పథకం సిబ్బందికి సాధారణ ఫోన్లు ఉచితంగా అందజేసింది. ఆన్లైన్ చెల్లింపులు ప్రారంభమవడంతో నాలుగేళ్ల క్రితం రూ.6,700 విలువైన శాంసంగ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు అందజేసింది. ఫోన్ ధరలో 50 శాతం సిబ్బంది చెల్లిస్తే, మిగిలిన మొత్తం గ్రామీణాభివృద్ధి భరిస్తుందని మొదట్లో చెప్పినా ఆ మొత్తాన్ని కూడా సిబ్బంది వేతనం నుంచే వసూలు చేశారు. వద్దన్నా ఫోన్లు సెల్‌ఫోన్ కంపెనీల మధ్య పోటీ నేపథ్యంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, సరికొత్త ఫీచర్లతో మొబైల్ ఫోన్లు చౌకధరలకే లభిస్తున్నాయి. ఉపాధి సిబ్బంది కూడా రూ.10 వేలకు పైగా విలువైన లేటెస్ట్ మోడల్ స్మార్ట్ఫోన్లతో రోజువారీగా కూలీల హాజరు, కొలతలు, జీపీఎస్ ద్వారా క్షేత్రస్థాయి నుంచే ఎన్ఆర్ఈజీఎస్ వెబ్‌సైట్‌కు అప్లోడ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయి ఫీల్డ్ అసిస్టెంట్లతో పాటు మేట్లు కూడా వీటినే వినియోగిస్తున్నారు. ఈ నేథ్యంలో ఇటీవల ఎన్ఆర్ఈజీఎస్ సరఫరా చేసే స్మార్ట్ ఫోన్లు ఎవరికి కావాలంటూ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ నుంచి ఉపాధి సిబ్బందిని అడిగారు. 80 శాతం మందికి పైగా క్షేత్రస్థాయి సిబ్బంది తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలోని అన్ని డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయాలకు పాతబడిన శాంసంగ్ జే2 ప్రో మొబైల్ పార్శిళ్లు వచ్చిచేరాయి. జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖలో ఏపీడీ, పీఓ, టెక్నిలక్ అసిస్టెంట్స్, సీనియర్ మేట్లు కలిపి 1035 మంది ఉన్నారు. వారందరికీ రూ.93 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. ఇప్పటికే 80 శాతం ఫోన్లను ఎంపీడీఓ కార్యాలయాలకు సరఫరా చేశారు. కొంత మంది సిబ్బందికి సైతం పంపిణీ చేశారు. మిగిలిన వారికి రెండు మూడు రోజుల్లో అందజేయనున్నారు. సిబ్బంది అప్పుగా ఫోన్లు ఇచ్చి, నెలకు రూ.900 చొప్పున జీతంలో కోత విధించనున్నారు. పాత ఫోన్లకు అధిక ధర శ్యాంసంగ్ జే2 ప్రో మోడల్ పాతబడింది. ప్రస్తుతం సరికొత్త జే7 మోడల్ మార్కెల్లో లభిస్తోంది. ఈ ఫోన్ల కంటే ఎక్కువ ఫీచర్స్ ఉన్న వీవో, అప్పో ఫోన్లు చౌకగా లభిస్తున్నాయి. ఆ కంపెనీలతో పోల్చితే శాంసంగ్ బ్యాటరీ లైఫ్, ఫీచర్స్ కూడా తక్కువే. అమెజాన్ వంటి ఆన్లైన్ సంస్థ రూ.8,470 రూపాయలకే విక్రయిస్తున్న జే2 ప్రో ఫోన్‌ను రూ.9080కు అంటగడుతున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 26,786 మందికి అంటగట్టేందుకు రూ.24.32 కోట్లు వెచ్చించి ఫోన్లుకొన్నారు. ఇన్ని ఫోన్లు కొంటే ఆన్లైన్ ధరకంటే తక్కువకే రావాలి. అయితే ధర అంతకు విరుద్ధంగా ఉంది. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల పాత్ర దాగుందని, ఇందులో భాగంగానే తమ కమీషన్ల కోసం సిబ్బందిని పావులుగా వాడుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. -
శామ్సంగ్ గెలాక్సీ ఫోన్లలో తెలుగు కంటెంట్
న్యూఢిల్లీ: శామ్సంగ్ స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లలో యూజర్ ఇంటర్‌ఫేస్‌లు తెలుగులో లభించనున్నాయి. గెలాక్సీ రేంజ్ ఫోన్లు, ట్యాబ్ త్రీలు ఇక తెలుగు భాష కంటెంట్‌ను సపోర్ట్ చేస్తాయి. తెలుగుతోపాటు హిందీ, పంజాబీ, బెంగాలీ, తమిళం, కన్నడం, మలయాళం, మరాఠీ, గుజరాతీ మొత్తం 9 భారతీయ భాషల్లో యూజర్ ఇంటర్‌ఫేస్‌లను, కంటెంట్‌ను అందిస్తున్నామని శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ మంగళవారం తెలిపింది. గెలాక్సీ గ్రాండ్, ఎస్4, ట్యాబ్ 3ల్లో ఈ సదుపాయం మంగళవారం నుంచే లభ్యమవుతోందని శామ్సంగ్ ఇండియా కంట్రీ హెడ్(మొబైల్ అండ్ ఐటీ) వినీత్ తనేజా చెప్పారు. కంపెనీ చౌక స్మార్ట్ఫోన్లలో (గెలాక్సీ స్టార్ నుంచి మొదలుకొని)మరిన్ని భారతీయ భాషల్లో కంటెంట్‌ను ఈ నెలలోనే అందించనున్నామని పేర్కొన్నారు.. ప్రాంతీయ భాషల్లో భావ వ్యక్తీకరణ పట్ల మొబైల్ యూజర్లలో డిమాండ్ పెరుగుతోందని.. ప్రాం తీయ భాషల్లో కంటెంట్ కోసం కంటెంట్ ప్రొవైడర్స్, ఆప్ డెవలపర్స్‌తో కలసి పనిచేస్తున్నామన్నారు. అన్ని భారతీయ భాషల్లో దీన్ని విస్తరిస్తామని వివరించారు. కాగా ఈ శామ్సంగ్ సౌకర్యం కారణంగా మొబైల్ డేటా వినియోగం బాగా పెరుగుతుందని నేషనల్ ఇన్నోవేషన్ కౌన్సిల్ సభ్యుడు కిరణ్ కార్నిక్ చెప్పారు. మొబైల్ కంపెనీలు రూ.2,500 కంటే తక్కువకే లభ్యమయ్యేలా స్మార్ట్ఫోన్లను అందించాలన్నారు. శామ్సంగ్ స్మార్ట్ఫోన్లలో ఫేస్బుక్ మెసెంజర్ 9 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుందని ఫేస్బుక్ ఇండియా కంట్రీ గ్రోత్ మేనేజర్ కెవిన్ డిసౌజా చెప్పారు.