న్యూఢిల్లీ: శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లలో యూజర్ ఇంటర్‌ఫేస్‌లు తెలుగులో లభించనున్నాయి. గెలాక్సీ రేంజ్ ఫోన్లు, ట్యాబ్ త్రీలు ఇక తెలుగు భాష కంటెంట్‌ను సపోర్ట్ చేస్తాయి. తెలుగుతోపాటు హిందీ, పంజాబీ, బెంగాలీ, తమిళం, కన్నడం, మలయాళం, మరాఠీ, గుజరాతీ మొత్తం 9 భారతీయ భాషల్లో యూజర్ ఇంటర్‌ఫేస్‌లను, కంటెంట్‌ను అందిస్తున్నామని శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ మంగళవారం తెలిపింది. గెలాక్సీ గ్రాండ్, ఎస్4, ట్యాబ్ 3ల్లో ఈ సదుపాయం మంగళవారం నుంచే లభ్యమవుతోందని శామ్‌సంగ్ ఇండియా కంట్రీ హెడ్(మొబైల్ అండ్ ఐటీ) వినీత్ తనేజా చెప్పారు.
కంపెనీ చౌక స్మార్ట్‌ఫోన్లలో (గెలాక్సీ స్టార్ నుంచి మొదలుకొని)మరిన్ని భారతీయ భాషల్లో కంటెంట్‌ను ఈ నెలలోనే అందించనున్నామని పేర్కొన్నారు.. ప్రాంతీయ భాషల్లో భావ వ్యక్తీకరణ పట్ల మొబైల్ యూజర్లలో డిమాండ్ పెరుగుతోందని.. ప్రాం తీయ భాషల్లో కంటెంట్ కోసం కంటెంట్ ప్రొవైడర్స్, ఆప్ డెవలపర్స్‌తో కలసి పనిచేస్తున్నామన్నారు. అన్ని భారతీయ భాషల్లో దీన్ని విస్తరిస్తామని వివరించారు. కాగా ఈ శామ్‌సంగ్ సౌకర్యం కారణంగా మొబైల్ డేటా వినియోగం బాగా పెరుగుతుందని నేషనల్ ఇన్నోవేషన్ కౌన్సిల్ సభ్యుడు కిరణ్ కార్నిక్ చెప్పారు. మొబైల్ కంపెనీలు రూ.2,500 కంటే తక్కువకే లభ్యమయ్యేలా స్మార్ట్‌ఫోన్‌లను అందించాలన్నారు. శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్లలో ఫేస్‌బుక్ మెసెంజర్ 9 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుందని ఫేస్‌బుక్ ఇండియా కంట్రీ గ్రోత్ మేనేజర్ కెవిన్ డిసౌజా చెప్పారు.
శామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్లలో తెలుగు కంటెంట్
Published Wed, Aug 14 2013 1:54 AM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM
Advertisement
Advertisement