
వివరాలు వెల్లడిస్తున్న సందీప్ శాండిల్య. చిత్రంలో సునీల్‌దత్, చక్రవర్తి గుమ్మి తదితరులు
సాక్షి, హైదరాబాద్: హబీబ్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఇద్దరు జేబు దొంగల అరెస్టుతో చిక్కిన తీగ లాగితే.. కర్ణాటకలోని బీదర్ కేంద్రంగా సాగుతున్న నిట్రావెట్ టాబ్లెట్స్ అక్రమ దందా వెలుగులోకి వచ్చింది.నగర కొత్వాల్ సందీప్ శాండిల్య, డీసీ పీలు సునీల్‌దత్, చక్రవర్తి గుమ్మిలతో కలిసి శనివా రం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించా రు. మల్లేపల్లిలోని మాన్గార్ బస్తీకి చెందిన ఎన్.చక్రధారి గుల్బర్గా నుంచి నిట్రావెట్ మాత్రలను అక్రమంగా ఖరీదు చేసి, నగరానికి తరలించి విక్రయిస్తుంటాడు.
తీవ్రమైన రక్తపోటు, మధుమేహ వ్యా ధులతో బాధపడుతున్న వారికి రాత్రి వేళల్లో సరిగ్గా నిద్రపట్టదు. ఈ కారణంగా వైద్యులు రోగులకు ఈ మాత్రలను ప్రిస్రై్కబ్ చేస్తారు. నార్త్‌జోన్ టాస్‌్కఫోర్స్ పోలీసులు గత ఆదివారం చక్రధారిని అరెస్టుచేసి విచారిస్తున్న సమయంలోనే బీదర్‌కు చెందిన బిర్జు ఉపాధ్యాయ వీటిని సరఫరా చేస్తున్నట్లు బయటపెట్టాడు. దీంతో ఈ సమాచారాన్ని టాస్‌్కఫోర్స్ పోలీసులు టీఎస్ నాబ్‌కు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment